యాంకర్ ప్రదీప్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు సాయం..

ప్రదీప్ సినిమా పాట విడుదల చేయనున్న మహేష్ బాబు (Pradeep Machiraju Mahesh Babu)

Anchor Pradeep Machiraju: తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఈయన హీరోగా సినిమా వస్తుందిప్పుడు. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనదైన సాయం చేస్తున్నాడు.

  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈయ‌న హీరోగా మార‌బోతున్నాడు. చాలా రోజుల నుంచి ప్ర‌దీప్ హీరో కావ‌డానికి ప్ర‌య‌త్నాలు అయితే చేస్తున్నాడు కానీ స‌రైన క‌థ దొర‌క‌లేదు. యాంక‌ర్ ర‌వి ఇప్ప‌టికే హీరోగా ప్ర‌య‌త్నించి మ‌ళ్లీ టీవీ షోల‌తో బిజీ అయిపోయాడు. ఆ మ‌ధ్య ఇది మా ప్రేమ‌క‌థ అంటూ వ‌చ్చాడు ర‌వి. అది వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కులకు తెలియ‌దు. దాంతో మ‌ళ్లీ గో బ్యాక్ అనేసాడు ర‌వి.

Anchor Pradeep Machiraju will take love classes for Youth and he is debut as hero as Love Guru subject pk తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. anchor pradeep,pradeep machiraju,pradeep machiraju hero,pradeep machiraju love guru,pradeep machiraju 30 rojullo preminchadam yela,pradeep machiraju love classes,pradeep machiraju ktuc 4,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా
యాంకర్ రవి ఫైల్ ఫోటో


ఇప్పుడు ప్ర‌దీప్ కూడా త‌న ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఈయ‌న హీరోగా మున్నా అనే దర్శకుడు సినిమా చేస్తున్నాడు. దీనికి 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి అప్లాజ్ తెచ్చుకుంది. సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసాడు మున్నా. ఈ చిత్రాన్ని కొత్త నిర్మాత‌లు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థ ఇది. రొటీన్ క‌థ‌ల‌తో కాకుండా కాస్త కొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌దీప్. ఇందులో లవ్ గురుగా నటిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు.

ప్రదీప్ సినిమా పాట విడుదల చేయనున్న మహేష్ బాబు (Pradeep Machiraju Mahesh Babu)
ప్రదీప్ సినిమా పాట విడుదల చేయనున్న మహేష్ బాబు (Pradeep Machiraju Mahesh Babu)


ఈ చిత్ర షూటింగ్‌లోనే గాయపడి నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకున్నాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా కోసం స్టార్స్‌ను వాడేసుకుంటున్నాడు ప్రదీప్. ఇప్పటికే ఫస్ట్ లుక్ రానాతో లాంఛ్ చేయించాడు ఈ యాంకర్. ఇప్పుడు ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం అనే పాటను మహేష్ బాబుతో విడుదల చేయిస్తున్నాడు. జనవరి 31న ఈ పాట విడుదల కానుంది. ఫుల్ వీడియో సాంగ్ రానుంది. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఈ పాటను లేటెస్ట్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడటం విశేషం.

రానా చేతులు మీదుగా విడుదలైన ప్రదీప్ మాచిరాజు ఫస్ట్ లుక్


సీనియ‌ర్ లిరిక్ రైట‌ర్ చంద్రబోస్ అన్ని పాటలు రాసాడు. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా అమృత అయ్యర్ అనే అమ్మాయి నటిస్తుంది. ఈమె తాజాగా రెడ్ సినిమాలో రామ్‌తో కూడా నటించే అవకాశం అందుకుంది. కేవ‌లం కోటిన్నరతో మొద‌లు పెట్టిన ఈ చిత్రానికి దాదాపు 3.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి 30 రోజుల్లో ఎలా ప్రేమించాలి అనే దానిపై ఈయన పాఠాలు చెప్పబోతున్నాడు ఈ చిత్రంలో. మరి యాంకర్ ప్రదీప్ ప్రేమపాఠాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: