నిర్భయ దోషుల ఉరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం కాస్త ఆలస్యంగా గెలిచింది కానీ చివరికి గెలిచింది న్యాయమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తమ మనసులో మాట చెప్పారు. తాజాగా మహేష్ బాబు కూడా ఇదే విషయంపై ట్వీట్ చేసాడు. నిర్భయ దోషులను ఉరి తీయడంపై సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందించాడు. చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న న్యాయం ఇప్పటికీ జరిగింది. నిర్భయ కేసులో జరిగిన తీరుతో మరోసారి న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం వచ్చిందని ట్వీట్ చేసాడు సూపర్ స్టార్.
Long awaited but Justice done!! #NirbhayaVerdict restores our faith in the judiciary. Saluting her parents and their advocates for their continuous unflinching efforts. Respect for our judicial system🙏🙏 still advocating for stricter laws and quicker verdicts in heinous crimes🙏
— Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2020
న్యాయం కోసం రేయింబవళ్లు పోరాడిన నిర్భయ తల్లిదండ్రులకు సెల్యూట్ చేసాడు మహేష్ బాబు. మన న్యాయ వ్యవస్థను అంతా గౌరవించాలని కోరుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికీ కొన్ని దారుణాలు జరిగినపుడు వెంటనే అమలయ్యే శిక్షలు ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు చేయాలేమో అంటున్నాడు మహేష్. ఏదేమైనా కూడా న్యాయం గెలిచినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈయన పరుశురామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Nirbhaya case, Telugu Cinema, Tollywood