MAHESH BABU INTERESTING COMMENTS ON RAYALASEEMA PEOPLE AT SARKARU VAARI PAATA SUCCESS MEET SB
Mahesh Babu: ఇది సక్సెస్ మీట్లా లేదు... రాయలసీమపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్
Mahesh Babu Photo : Twitter
సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కార్యక్రమంలో రాయలసీమపై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కడు సినిమా తర్వాత చాలా ఏళ్లకు కర్నూలు వచ్చామన్నారు ప్రిన్స్.
కర్నూలులో సర్కారు వారి పాట సక్సెస్ మీట్(Sarkaru Vaari Paata Success Meet) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు(Mahesh Babu) మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్లయు చేయాలి. ఎప్పుడో ఒక్కడు సినిమా షూటింగ్కు చాలా రోజుల క్రితం కర్నూలు(Kurnool)కు వచ్చానన్నారు . రెండు రోజుల ముందు కర్నూలులో ఫంక్షన్ చేద్దామంటే సరే అన్నానని ఆయన చెప్పారు. కానీ ఇంతమంది వస్తారని నేను నిజంగా అనుకోలేదన్నారు మహేష్ బాబు. అందుకే నిజంగా ఫస్ట్ టైం మీకోసమే వచ్చి స్టేజ్ పై డాన్స్ కూడా వేశానన్నారు. ఇంతవరకు ఎక్కడా ఏ ఫంక్షన్లో కూడా డాన్స్ చేయలేదన్నారు.
కర్నూలు ప్రజల అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు మహేష్. ప్రజల అభిమానులు,ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఇది సర్కారు వారి పాట సక్సెస్ మీట్ లా లేదు .. వంద రోజుల ఫంక్షన్లా ఉందన్నారు మహేష్ బాబు.
ఫంక్షన్లు అంటూ జరగాలంటే.. రాయలసీమలోనే జరగాలన్నట్టుగా ఉందంటూ మహేష్(Mahesh Babu) వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న అభిమానులంతా ఈలలు వేస్తూ గోలలు చేశారు.
సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా తన ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం చూశానన్నారు మహేష్ బాబు. సినిమా చూడగానే.. తన కుమారుడు గౌతమ్ లేచి గట్టిగా తనను హగ్ చేసుకున్నాడన్నాడని తెలిపారు. సితార అయితే.. ఈ సినిమాలో నువ్వు అన్ని సినిమాల్లో కల్లా ఈ సినిమాలో చాలా బాగా చేశావు నాన్న.. చాలా అందంగా ఉన్నవాని సితార(Sitara) చెప్పిందన్నారు. ఆ గొప్పదనం మాత్రం పరుశురాందే అన్నారు మహేష్. ఈ మహేష్ తన జీవితంలో గుర్తుండిపోతుందన్నారు. నిజంగా ఈ అభిమానం నేను మర్చిపోలేదన్నారు.
ఇక తనకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ సర్కారు వారి పాట అని తాను ముందుగానే చెప్పానన్నారు. ఈ సక్సెస్ తనకు ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. ఇక ఈసినిమాలో తన ఫేవరేట్ లవ్ ట్రాక్ అన్నారు. లవ్ ట్రాక్ చాలా ఫీల్ అయ్యానన్నారు. అది చేసేటప్పుడు అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందం కలిగిందన్నారు. మనం మన సినిమాలు గురించి వంద అనుకుంటాం కానీ.. అభిమానులు ఏం అంటున్నారనేది కావాలన్నారు. సర్కారు వారి పాట షూటింగ్ జరిగిన రెండేళ్లు చాలా కష్టపడ్డమన్నారు, కరోనా(Covid) వల్ల షూటింగ్ జరగడం, ఆగిపోవడం నిజంగా చాలా కష్టపడ్డమన్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.