Home /News /movies /

MAHESH BABU INTERESTING COMMENTS ON AP CM JAGAN MOHAN REDDY SB

Mahesh Babu: సీఎం జగన్ గురించి మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

జగన్ పై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ పై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మొదటి సారి సీఎం జగన్‌‌ను కలిసినప్పుడు ఆయనను చూసి ఆశ్చర్యపోయానన్నారు మహేష్ బాబు. ఆయన అంత సింపుల్‌గా ఉంటారని అస్సలు అనుకోలేదన్నారు మహేష్.

    టాలీవుడ్ ప్రిన్సెస్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా టీం ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా మారింది. మహేష్ కూడా మీడియా ఛానల్స్‌కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా మహేష్... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ... టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు జగన్‌ను వెళ్లి కలిసిన సంగతి తెలిసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్, రాజమౌళి కూడా జగన్‌ను కలిశారు.

    ఇటీవలే మహేశ్‌ బాబు మీడయాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ గురించి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదన్నారు మహేష్. కానీ మొదటిసారి జగన్‌ను కలవడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు మహేష్ బాబు. జగన్ చాలా సింపుల్‌ అని..ఆయన అంత సింపుల్‌గా ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు.

    ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారన్నారు. ఆయనతో చాలా విషయాలను చర్చించామన్నారు. సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారన్నారు.  ఇలాంటి మీటింగ్ ఎప్పుడో జరిగి ఉంటే బాగుంటుందని తాను సలహా ఇచ్చానని మహేష్ బాబు తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన మమల్ని రిసీవ్ చేసుకున్న విధానం తనకు బాగా నచ్చిందన్నారు. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది అంటూ మహేష్ బాబు చెప్పు కొచ్చారు.

    ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ ప్రిన్స్.. జగన్ పై చేసిన వ్యాఖ్యలను.. అటు వైఎస్ఆర్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో పెంచుకునేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సర్కారు వారి పాట సినిమాకు డైరెక్టర్ పరుశురామ్.. దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా.. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ap cm jagan, Mahesh Babu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు