Home /News /movies /

MAHESH BABU IN QUE FOR MOVIE TICKETS IN MAJOR MOVIE PROMOTIONS SB

Mahesh Babu: సినిమా టికెట్ కోసం లైన్‌లో నిల్చున్న మహేష్ బాబు.. వెనకాలే అడవిశేష్ కూడా!

మహేష్ బాబు

మహేష్ బాబు

సినిమా టికెట్లకోసం క్యూలో నిల్చొన్న ఓ అమ్మాయి ముందు వచ్చి బ్లూ షర్ట్‌లో మహేష్ బాబు ప్రత్యక్షం అవుతాడు.ఇక తన ముందు నీల్చొన్న మహేష్‌ను చూసి ఆ అమ్మాయి సర్ ప్రైజ్ అవుతుంది.

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu) మూవీ ప్రమోషన్లలో బిజీగా మారాడు. అయితే.. ఈ సారి తన సినిమా కాదండోయ్. మహేష్ నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. అయితే తాజాగా మహేష్ ఓ సినిమా టికెట్ల కోసం క్యూలో నిల్చొని సందడి చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. ఇంతకీ మహేష్ ఏ సినిమా కోసం ఇలా చేశాడనుకుంటారా. తన ‘సర్కారు వారి పాట’ సినిమా చూడ్డానికో, మరో చిత్రాన్ని వీక్షించడానికో ఆయన అలా చేయలేదు. తాను నిర్మించిన ‘మేజర్‌’ (Major) ప్రచారంలో భాగంగానే ఆయన ఓ థియేటర్‌ ముందు క్యూలో నిలబడ్డాడు మహేష్ బాబు.

    యూట్యూబర్‌, డిజిటల్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం (Niharika NM)తో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేశారు అడవి శేష్, మహేష్ బాబు. ఆ ఫన్నీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడు ఈ వీడియో అందర్నీ మరింత అట్రాక్ట్ చేస్తోంది. వీడియోలో... నిహారిక సినిమా టికెట్‌ కోసం లైన్‌లో నిలబడగా ఆమె ముందుకు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మధ్యలో మేజర్ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) కూడా రాగానే వాగ్వాదం చోటుచేసుకుంటుంది. క్యూలో మధ్యలో వచ్చి అలా నిలబడతావేంటి అంటూ అడవి శేష్‌తో నిహారిక గొడవాడుతూ ఉంటుంది. ఈలోపు మహేశ్‌బాబు (Mahesh Babu) వచ్చి క్యూలో నిహారిక ముందు నిలబడతారు. ఆయన్ను చూడగానే నిహారిక సర్‌ప్రైజ్‌ అవుతుంది. ‘మా స్నేహితులను కూడా పిలవొచ్చా’ అని మహేశ్‌ ఆమెను అడగ్గానే ఓకే అంటుంది. దాంతో లైన్‌ పెరుగుతుంది. ఫోన్‌ నంబరు అడిగేలోపు మహేశ్‌ అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో నిహారిక అసహనం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత అడవి శేష్ నా ఫోన్ నెంబర్ వద్దా అంటూ నిహారికను ఆటపట్టించి.. నెంబర్ ఇవ్వడంతో వీడియో ముగుస్తుంది.

    మరోవైపు మేజర్(Major) చిత్రాన్ని ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన వీరజవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రమే ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల మేజర్ సినిమాను విడుదల చేస్తున్నారు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లలో మహేష్ బాబు... అడవి శేష్(Adavi Sesh) బిజీగా మారారు. ఈ సినిమాలో శోభిత, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Adavi sesh unhealty, Mahesh Babu, Major film

    తదుపరి వార్తలు