MAHESH BABU GIVEN A SUPERB PARTY TO SARILERU NEEKEVVARU MOVIE TEAM IN HIS HOUSE PK
మహేష్ బాబు నైట్ పార్టీ.. సరిలేరు నీకెవ్వరు టీంతో రాత్రంతా రచ్చ..
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’(Twitter/Photo)
మహేష్ బాబు ఈ మధ్య బాగా మారిపోయాడు. ఈయన పార్టీలు కూడా బాగానే చేసుకుంటున్నాడు. ముఖ్యంగా తన చిత్ర యూనిట్స్లో ఎక్కడలేని జోష్ నింపుతున్నాడు ఈయన. ఇప్పుడు కూడా సరిలేరు నీకెవ్వరు..
మహేష్ బాబు ఈ మధ్య బాగా మారిపోయాడు. ఈయన పార్టీలు కూడా బాగానే చేసుకుంటున్నాడు. ముఖ్యంగా తన చిత్ర యూనిట్స్లో ఎక్కడలేని జోష్ నింపుతున్నాడు ఈయన. ఇప్పుడు కూడా సరిలేరు నీకెవ్వరు టీంతో ఫుల్ పార్టీ చేసుకున్నాడు సూపర్ స్టార్. ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక ముగిసిన కొన్ని గంటలకే మహేష్ ఇంట్లో పార్టీ చేసుకున్నారు సరిలేరు నీకెవ్వరు టీం. ప్రీ రిలీజ్ వేడుక సూపర్ సక్సెస్ కావడంతో అదే సందడి ఇంట్లో కూడా కంటిన్యూ చేసారు. అక్కడ వేడుక ముగిసిన తర్వాత మహేష్ ఇంట్లో మరో వేడుక మొదలైంది. అప్పటికే అక్కడ నమ్రత పూర్తి ఏర్పాట్లు చేయడంతో నైట్ అంతా అక్కడే రచ్చ చేసారు చిత్రయూనిట్.
సరిలేరు నీకెవ్వరు టీంతో పార్టీ చేసుకున్న మహేష్ బాబు
ఈ చిత్రానికి పనిచేసిన మెయిన్ సభ్యులు అంతా ఈ వేడుకలో మహేష్ బాబుతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్ రష్మిక మందన్న.. మరో హీరోయిన్ తమన్నా.. నిర్మాత అనిల్ సుంకర.. మహేష్ తర్వాత సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో సహా రైటర్ రామజోగయ్య శాస్త్రి ఉన్నారు. దేవీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాడు. వీళ్లే కాదు సినిమాకు పని చేసిన ఇంకొందరు టెక్నీషియన్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఏదేమైనా కూడా మహేష్ పార్టీ పిక్ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.