Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజుకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. దీంతో ఆయన అభిమానులను ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు ఒకేసారి మూడు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి బ్లాస్టర్ అదే నండి టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఇది విడుదల కానుంది. దీంతో పాటు మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌తో పాటు రాజమౌళితో మహేష్ బాబుకు సినిమాకు చెందిన ఓ అప్డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్, రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రకటనలు రెడీ చేసినట్టు సమాచారం. ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకు ఇప్పటికే అడ్వాన్స్ బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దిగిన లేటెస్ట్ ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిస్తున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Balakrishna - Mahesh Babu: మహేష్ బాబు కాపీ కొట్టిన బాలకృష్ణ ఈ సినిమాలు గురించి తెలుసా..
ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి..
Pawan Kalayan -Suriya - Satyadev: పవన్ కళ్యాణ్ టూ సూర్య, సత్యదేవ్ వరకు వెండితెర వకీల్‌సాబ్ వీళ్లే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, ParasuRam, Rajamouli, Sarkaru Vaari Paata, Tollywood, Trivikram