Home /News /movies /

MAHESH BABU GIFT TO HIS DAD KRISHNA ON BIRTHDAY SB

తండ్రికి అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్న మహేష్ బాబు... ఏంటో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్‌బాబు (photo: princemahesh.com)

సూపర్ స్టార్ మహేష్‌బాబు (photo: princemahesh.com)

త్వరలో మహేశ్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ అనిల్‌ ఇటీవల ట్విటర్‌ వేదికగా కాస్త కొత్తగా ప్రకటించారు.

    మహేష్ బాబు తన అభిమానులకు మరో కానుకను సిద్ధం చేస్తున్నారు. తన తండ్రి పుట్టినరోజున ఈ గిఫ్ట్‌ను తన ఫ్యాన్స్‌కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్ ప్రిన్స్. సూపర్‌స్టార్‌ కృష్ణ ఈనెల 31న తన 76వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. అయితే తండ్రి జన్మదిన్నాన్ని ఆయన కుమారుడు మహేశ్‌బాబు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు ఆయనకు బర్త్‌డే కానుకగా తన 26వ సినిమా గురించి మహేష్ అదే రోజు ప్రకటించబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుబుతున్నాయి. త్వరలో మహేశ్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ అనిల్‌ ఇటీవల ట్విటర్‌ వేదికగా కాస్త కొత్తగా ప్రకటించారు. 31న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా మహేష్ నిర్వహిస్తారని సమాచారం.

    అయితే అంతా అనుకున్నట్లు జరిగితే... జూన్ నుంచి మహేష్ కొత్త సినిమా షూటింగ్ కూడా షురూ కానుంది. అనిల్ సుంకర ఈ కొత్త సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ‘దూకుడు’, ‘f2’ లాగే ఈ సినిమా కూడా మంచి ఎంటర్‌టైనర్ మూవీగా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ‘మహర్షి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న మహేశ్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలో ఎంజాయ్‌ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన మహర్షి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వీకెండ్ వ్యవసాయం కాన్సెప్ట్‌తో ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది.
    First published:

    Tags: Maharshi, Mahesh, Mahesh babu, Tollywood

    తదుపరి వార్తలు