కొడుకు గౌతమ్‌ను ఆ గేమ్‌లో ఓడించిన మహేష్ బాబు..

Mahesh Babu: క్వారంటైన్ పీరియడ్‌ను మహేష్ బాబు వాడుకుంటున్నట్లు మరే హీరో వాడుకోవడం లేదేమో..? ఎప్పుడూ బిజీగా ఉండే ఈయన.. ఇప్పుడు అనుకోకుండా దొరికిన టైమ్‌ను..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 18, 2020, 4:18 PM IST
కొడుకు గౌతమ్‌ను ఆ గేమ్‌లో ఓడించిన మహేష్ బాబు..
పిల్లలతో ఆడుకుంటున్న మహేష్ బాబు (Mahesh Babu new look)
  • Share this:
క్వారంటైన్ పీరియడ్‌ను మహేష్ బాబు వాడుకుంటున్నట్లు మరే హీరో వాడుకోవడం లేదేమో..? ఎప్పుడూ బిజీగా ఉండే ఈయన.. ఇప్పుడు అనుకోకుండా దొరికిన టైమ్‌ను హాయిగా పిల్లలతో గడిపేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. కాలు కూడా బయటికి పెట్టకుండా సెలబ్రిటీస్ అంతా ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు అయితే రోజూ తన టైమ్ టేబుల్ కూడా సెట్ చేసుకున్నాడు. మొన్నటికి మొన్న గౌతమ్‌తో ఆన్‌లైన్ టెన్నిస్ గేమ్ ఆడిన మహేష్.. ఇప్పుడు మరో కొత్త గేమ్‌తో వచ్చాడు.
ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది ఈయన భార్య నమ్రత మహేష్. షూటింగ్స్ సమయంలో ఆయనకు పిల్లలతో గడిపే సమయం దొరకదు.. అందుకే ఈ కరోనా తీసుకొచ్చిన హాలీడేస్‌ను పూర్తిగా పిల్లలకే ఇచ్చేసాడు మహేష్. ప్రస్తుతం పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ బాబు ఆడుకుంటున్నాడు. మరోరోజు కూడా పిల్లలతో అలా గడిచిపోయింది అంటూ ట్వీట్ చేసింది మహేష్ భార్య నమ్రత. తాజాగా కొడుకు గౌతమ్‌తో బ్లింక్ అండ్‌ యు లూజ్ గేమ్ ఆడాడు మహేష్. అంటే ఎవరు ముందు కనురెప్పలు మూస్తే వాళ్లే ఓడినట్లు. ఈ గేమ్ ఆడేటప్పుడు గౌతమ్ నవ్వు ఆపుకోలేదు.. దాంతో తండ్రితో ఓడిపోయాడు ఘట్టమనేని వారసుడు.రోజూ పొద్దున్నే లేవడం.. పిల్లలతో ఆడుకోవడమే మహేష్ బాబుకు సరిపోతుంది. సితార పాప అయితే తండ్రిని వదలడంలేదు. ఏం చేసినా కూడా పక్కనే ఉంటుందని చెబుతుంది నమ్రత. మొన్నీమధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈయన.. త్వరలోనే పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా పరుశురామ్ తన స్క్రిప్టును మహేష్ బాబుకు మెయిల్ చేసాడని తెలుస్తుంది. అక్కడే చదువుతున్నాడని.. డౌట్స్ వచ్చినా కూడా ఆన్‌లైన్‌లోనే మాట్లాడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు సూపర్ స్టార్.
First published: May 18, 2020, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading