హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ కళ్యాణ్ బాటలో మహేష్ బాబు.. ఏ విషయంలో తెలుసా..

పవన్ కళ్యాణ్ బాటలో మహేష్ బాబు.. ఏ విషయంలో తెలుసా..

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

మహేష్ బాబు ఏంటి పవన్ కళ్యాన్ బాటలో నడవటం ఏమిటి అనుకుంటున్నారా.. కొంపదీసి మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ జనసేనలో జాయిన్ అవుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే.

  మహేష్ బాబు ఏంటి పవన్ కళ్యాన్ బాటలో నడవటం ఏమిటి అనుకుంటున్నారా.. కొంపదీసి మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ జనసేనలో జాయిన్ అవుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. మహేష్ కూడా పవన్ కళ్యాణ్‌ల వేరే హీరోలతో సినిమాలు నిర్మించాడినికీ రెడీ అవుతున్నాడు. ఈ మధ్యకాలంల మన హీరోలు..ఒక వైపు యాక్టింగ్ చేసుకుంటూనే...ఇంకోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇందుల కొంత మంది కథానాయకులు ఒక అడుగు ముందుకేశి ఆళ్ల ఫ్యామిలీ హీరోలతో కాకుండా బయటి కథానాయకులతో  సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా నితిన్ హీరోగా..త్రివిక్రమ్‌తో కలిసి ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా హీరో మహేష్ బాబు కూడా అడివి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ మహేష్..తాను హీరోగా కాకుండా బయటి హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఫస్ట్ టైమ్. ఈ సినిమాను 26/11 దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అడివి శేష్..అప్పటి ఆపరేషన్‌లో పాల్గొన్న ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు.


  Mahesh Babu Follows Pawankalyan Like Film Producing With Other Heroes, Mahesh Babu, Mahesh Babu Pawan Kalyan Nani kalyan Ram As Producers With Other heroes, Mahesh nani major movie, Mahesh babu Follows Pawan kalyan Like Film Producing With Other Heroes, Tollywood, Telugu Cinema, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నాని కళ్యాణ్ రామ్ మంచు విష్ణు నిర్మాతలు, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
  మహేష్ బాబు మేజర్ సినిమా


  మహేష్‌ , పవన్ కళ్యాణ్‌ల కంటే  ముందు వేరే హీరోలతో సినిమాలు తీసిన హీరోలు చాలా మందే ఉన్నారు. మరోవైపు నితిన్ కూడా అక్కినేని అఖిల్‌ను పరిచయం చేస్తూ ‘అఖిల్’ సినిమాను ప్రొడ్యూస్ చేసాడు.


  Who Is the Director of Akkineni Akhil Next movie, Akhil, హీరోగా అఖిల్ కెరీర్ మూడు అడుగులు ముందుకు..ఆరు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. మిస్టర్ మజ్ను ఫ్లాప్‌తో అఖిల్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడెవరనే దానిపై ఫూటకో పేరు వినబడుతోంది. Akhil Next Movie, Akhil Next Movie Krish, Akhil Next Movie With Satya Prabhas, Akhil Next Movie With Parashuram, Akhil Next Movie With bommarillu Bhaskar, Who Is the director Of Akhil Next Movie, Telugu cinema, tollywood News, అఖిల్, అఖిల్ క్రిష్, అఖిల్ నెక్ట్స్ మూవీ క్రిష్, అఖిల్ నెక్ట్స్ మూవీ సత్యప్రభాస్, అఖిల్ గీతా గోవిందం ఫేమ్ పరశురామ్, అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్ ఎవరు
  అఖిల్ అక్కినేని ఫైల్ ఫోటో


  మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘కిక్ 2’ సినిమాను నిర్మించాడు. మరోవైపు మంచు విష్ణు కూడా సంపూర్ణేష్ బాబుతో ‘సింగం 123’ వంటి కామెడీ సినిమా తీసిన ట్రాక్ రికార్డు ఉంది. ఇక నాని కూడా సందీప్ కిషన్, వరుణ్ సందేశ్‌లతో ‘డీ ఫర్ దోపిడి’ సినిమాను తెరకెక్కించాడు. లేటెస్ట్‌గా వేరే వాళ్లతో ‘అ’ సినిమాను తెరకెక్కించాడు.


  అంతకు ముందు చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా వాళ్ల ఓన్ బ్యానర్‌ అంజనా ప్రొడక్షన్స్‌లో శ్రీకాంత్ హీరోగా బాపు దర్శకత్వంలో ‘రాధా గోపాలం’ సినిమాను తెరకెక్కించాడు. అటు బాలకృష్ణ సొంత ఓన్ ప్రొడక్షన్ రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో తమ్ముడు రామకృష్ణ నిర్మాణంలో ముప్పలనేని శివ దర్శకత్వలో శ్రీకాంత్ హీరోగా ‘శుభలేఖలు అనే సినిమాను తెరకెక్కించారు.


  Mahesh Babu Follows Pawankalyan Like Film Producing With Other Heroes, Mahesh Babu, Mahesh Babu Pawan Kalyan Nani kalyan Ram As Producers With Other heroes, Mahesh nani major movie, Mahesh babu Follows Pawan kalyan Like Film Producing With Other Heroes, Tollywood, Telugu Cinema, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నాని కళ్యాణ్ రామ్ మంచు విష్ణు నిర్మాతలు, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
  బాలకృష్ణ, చిరంజీవి( ఫేస్‌బుక్ ఫోటోలు)


  అటు సీనియర్ హీరో నాగార్జున కూడా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌లో ...జగపతిబాబుతో ‘ఆహా’ సినిమాను నిర్మించిన ట్రాక్ రికార్డు వుంది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలనే కాదు...వేరే భాష ఇండస్ట్రీ విషయానకొస్తే... ధనుశ్, షారుఖ్, సల్మాన్, అమీర్,జాన్ అబ్రహం వంటి చాలా మంది హీరోలు వేరే హీరోలతో సినిమాలు తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు.  ఈ రకంగా కథానాయకులు...బయటి హీరోలతో సినిమాలు నిర్మించడమనేది ఇపుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్‌గా మారింది.


   

  First published:

  Tags: Mahesh babu, Nani, Pawan kalyan, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు