అవును వినడానికి విచిత్రంగా ఉన్న నందమూరి బాలకృష్ణను మహేష్ బాబు ఫాలో అవుతున్నాడు. అలాగే సూపర్ స్టార్ బాటలో బాలయ్య ప్రయాణిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హీరోగా నందమూరి బాలకృష్ణ గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మాస్‌లో ముఖ్యంగా బీసీ సెంటర్స్‌లో బాలయ్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మ్యాన్ ఆప్ మాసెస్‌గా బాలయ్యను అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. ఇక బాలయ్యకు మాస్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో క్లాస్ జనాల్లో మాత్రం అంతగా లేదు. మరోవైపు ఓవర్సీస్ ఆడియన్స్‌లో కూడా బాలయ్యకు అంతగా ఆదరణ లేదు. అందుకే ప్రస్తుతం కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేసిన ‘రూలర్’ సినిమాలో మాస్ పాత్రే అయినా.. క్లాస్‌గా కనిపించడానికి బాలయ్య ఎక్కువ మొగ్గు చూపాడు. క్లాస్ లుక్‌లో బాలయ్య లుక్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఈ సినిమాతో బాలయ్య క్లాస్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాల్సి వస్తే.. అమ్మాయిల్లో క్లాస్ ప్రేక్షకుల్లో ఆయనకు బోలెడు అభిమానులున్నారు. ఓవర్సీస్ ఆడియన్స్ ఫాలోయింగ్‌లో మహేష్ బాబు తర్వాతే ఎవరైనా. కానీ మాస్ ప్రేక్షకుల దగ్గరకి వచ్చేసరికి మహేష్ బాబు ఫాలోయింగ్ కాస్త తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా బీసీ సెంటర్స్‌లో మహేష్ బాబుకు అభిమానులన్న వీరాభిమానులు మాత్రం లేరు. అందుకే ఇపుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో పూర్తి అవుట్ అండ్ ఔట్ మాస్ మాస్ క్యారెక్టర్‌తో నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఈ సినిమాతో బీసీ సెంటర్స్‌లో కూడా తన స్థానాన్ని ఇంకా సుస్థిరం చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి బాలకృష్ణ.. మాస్ నుంచి క్లాస్ వైపు అడుగులు వేస్తే.. మహేష్ బాబు మాత్రం క్లాస్ నుంచి మాస్ వైపు తన అడుగులు వేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Ravipudi, Balakrishna, K. S. Ravikumar, Mahesh Babu, Rashmika mandanna, Ruler, Sarileru Neekevvaru, Sonal chauhan, Telugu Cinema, Tollywood