మహేష్ బాబు మళ్లీ అదే సెంటిమెంట్.. పరశురామ్ సినిమాకు కూడా..

Mahesh Babu: ఇండస్ట్రీలో కొందరు హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వాటిని మాత్రం వదలరు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2020, 9:44 PM IST
మహేష్ బాబు మళ్లీ అదే సెంటిమెంట్.. పరశురామ్ సినిమాకు కూడా..
మహేష్ బాబు (Twitter/Mahesh Babu)
  • Share this:
ఇండస్ట్రీలో కొందరు హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వాటిని మాత్రం వదలరు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు. ఈయన ఇప్పటికే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు అంటూ మంచి హిట్ కొట్టాడు. దానికి ముందు కూడా మహర్షి, భరత్ అనే నేను సినిమాలు బాగానే ఆడాయి. దాంతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు సూపర్ స్టార్. ఈ క్రమంలోనే త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి అనుకున్నా కూడా ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది.
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి (Vamshi Paidipally Mahesh Babu)
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి (Vamshi Paidipally Mahesh Babu)


దాంతో ఇప్పుడు పరశురామ్ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు ఈయన. నిజానికి ఈ సినిమా మార్చ్ 25న ఉగాదికే ఓపెనింగ్ జరుపుకోవాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఇప్పుడు మే 31న ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా మహేష్ మే 31న తన సినిమాకి సంభందించి ఏదొక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కాబట్టి. ఈ సారి కూడా తన కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెట్టాలని చూస్తున్నాడు సూపర్ స్టార్.
మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)
మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)

ఎప్పట్లాగే ఈ పూజా కార్యక్రమానికి మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన పిల్లలతో కలిసి హాజరయ్యే అయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు రావట్లేదు.. అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే ఆయన తన సినిమా ఓపెనింగ్‌కు రాడు.. అదో సెంటిమెంట్ అంతే. ప్రతీసారి ఆయన భార్య పిల్లలు మాత్రమే వస్తుంటారు. తాను సినిమా ప్రారంభోత్సవానికి వస్తే ప్లాప్ అవుద్దని బలంగా నమ్ముతాడు మహేష్.
మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)
మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)

అందుకే పెళ్ళైన దగ్గర నుండి తన సతీమణి నమ్రతని సినిమా ప్రారంభోత్సవానికి పంపించడం సెంటిమెంట్‌గా ఫీల్ అవుతాడు. మధ్యలో కొన్ని సినిమాలు తాను రాకపోయినా కూడా ఫ్లాప్ అయ్యాయి కానీ మహేష్ మాత్రం అవేం పట్టించుకోడు. అందుకే ఈ సారి కూడా ఇదే చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌లో కానీ లేదంటే మహేష్ బాబు ఎంబీ ఆఫీస్‌లో కానీ ఈ సినిమా ఓపెనింగ్ జరగనుంది.
First published: May 21, 2020, 9:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading