Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందిగా..

Mahesh Babu Flipkart: మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు అనే విమర్శలు కూడా ఈయనపై ఉన్నాయి. చాలా సినిమాల్లో ఒకేలా ఉంటాడు ఈ సూపర్ స్టార్. పెద్దగా రిస్క్ తీసుకోడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2020, 10:16 PM IST
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందిగా..
మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)
  • Share this:
మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు అనే విమర్శలు కూడా ఈయనపై ఉన్నాయి. చాలా సినిమాల్లో ఒకేలా ఉంటాడు ఈ సూపర్ స్టార్. పెద్దగా రిస్క్ తీసుకోడు.. ఉన్న లుక్‌తోనే ముందుకు వెళ్తుంటాడు. మరీ విపరీతం అనిపించే ప్రయోగాల జోలికి వెళ్లడంలో మహేష్ వెనకే ఉంటాడు. అయితే రెండేళ్లుగా ఈయనలో మార్పు వచ్చింది. మహర్షిలో గడ్డంతో కనిపించాడు.. సరిలేరు నీకెవ్వరులో సైనికుడి గెటప్‌లో కనిపించాడు. ఇప్పుడు పరశురాం సర్కారు వారి పాట సినిమా కోసం మరోలా మారిపోతున్నాడు సూపర్ స్టార్. ఇందులో లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు మహేష్ బాబు. ఇక సినిమాలతోనే కాదు కమర్షియల్ యాడ్స్‌లో కూడా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. సినిమా షూటింగ్స్‌కు ఈయన ఇంకా రాలేదు కానీ కమర్షియల్ యాడ్స్‌కు మాత్రం వచ్చేస్తున్నాడు. మొన్నటికి మొన్న అన్నపూర్ణ సెవెన్ ఎకెర్స్‌లో యాడ్ షూటింగ్ చేసాడు సూపర్ స్టార్.

మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)
మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)


ఇదిలా ఉంటే తాజాగా ప్లిప్ కార్ట్ కోసం మహేష్ చేసిన యాడ్ ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. అందులో సూపర్ స్టార్ లుక్ కిక్ ఇస్తుంది. త్వరలో ఫ్లిప్ కార్ట్‌లో మొదలు కానున్న బిగ్ బిలియన్ డే ఆఫర్స్‌ను మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్నాడు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్‌నే తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో మహేష్ లుక్ అదిరిపోయింది.

మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)
మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)


దానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పరశురామ్ సర్కారు వారి పాట సినిమాలో కూడా ఇదే లుక్ ఉంటుదేమో అనుకుంటున్నారు అభిమానులు. ఫ్లిప్ కార్ట్‌లో ఉన్న అన్ని వస్తువులపై అత్యధిక డిస్కౌంట్స్‌తో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ రాబోతుంది. 5 రోజులు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. ముఖ్యంగా 45 ఏళ్ల వయసులోనూ మహేష్ బాబు ఫిజిక్ చూసి వారెవ్వా అంటున్నారు ఫ్యాన్స్.

మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)
మహేష్ బాబు న్యూ లుక్ (mahesh babu)


అలా ఉన్నాడు కాబట్టే సౌత్ ఇండియాలో అంతమంది హీరోలున్నా మహేష్ వెంటే పడుతున్నాయి కార్పోరేట్ కంపెనీలు. సూపర్ స్టార్ ఫోటోలు చూసి ఫ్లిప్ కార్ట్ యాడ్ మరింత ప్రేక్షకుల్లోకి దూసుకుపోతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 30, 2020, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading