హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: తొలిసారి తన కెరీర్‌లో అలాంటి పని చేయబోతున్న మహేష్ బాబు..

Mahesh Babu: తొలిసారి తన కెరీర్‌లో అలాంటి పని చేయబోతున్న మహేష్ బాబు..

మహేష్ బాబు (Twitter/Photo)

మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు తన 21 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ఆ పని చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కూడా ఆ పని చేసేసారు. అందుకే ఇపుడు మహేష్ బాబు ఆ పని చేస్తే.. చూడాలనుకుంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.

ఇంకా చదవండి ...

  Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు తన 21 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ఆ పని చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కూడా ఆ పని చేసేసారు. అందుకే ఇపుడు మహేష్ బాబు ఆ పని చేస్తే.. చూడాలనుకుంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ప్రస్తుతం మహేష్ బాబు..  పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.  త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో మహేష్ బాబు జాయిన్ కానున్నాడు. ఈ సినిమాను పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.

  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

  ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. అందుకే ఫ్లిప్‌కార్ట్ యాడ్‌లో అందుకే కనిపించనట్టు సమాచారం. ఈ ప్రకటనలో వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి తన పాత్రను ఎలా డిజైన్ చేసుకోవాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడట. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడట.

  Mahesh babu,Super Star Mahesh Babu,SSMB,Sarkaru Vaari pata,Mahesh Babu Dual Role,Mahesh Babu flip cart add,Mahesh Babu two charecters,tollywood,telugu cinemaమహేష్ బాబు,మహేష్ బాబు ద్విపాత్రాభినయం,మహేష్ బాబు రెండు పాత్రలు,అన్నాదమ్ములుగా మహేష్ బాబు,మహేష్ బాబు రెండు పాత్రలు,ఫ్లిప్‌కార్ట్‌ యాడ్‌లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం
  మహేష్ బాబు ద్విపాత్రాభినయం (Twitter/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే.. మహేష్ బాబు తొలిసారి సింగర్ అవతారం ఎత్తనున్నాడని సమాచారం. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు.. పాటగాళ్లుగా తమ సత్తా చూపించారు. ఇపుడు మహేష్ బాబు కూడా పాటగాడిగా తన టాలెంట్ చూపించడానికి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సింగర్‌గా మహేష్ బాబు గొంతు ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, ParasuRam, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు