Home /News /movies /

MAHESH BABU FANS TROLLING ON RAJAMOULI RRR TEAM ON TWITTER SB

Rajamouli: ఆ ట్వీట్‌‌తో అడ్డంగా బుక్కైన రాజమౌళి టీమ్.. నక్కన్న అంటూ మహేష్ ఫ్యాన్స్ ట్రోలింగ్

Rajamouli  Mahesh Babu Photo : Twitter

Rajamouli Mahesh Babu Photo : Twitter

రాజమౌళి టీంపై మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బూతులు తిడుతూ.. పోస్టులు పెడుతున్నారు. దీనికంతటికి మరో హీరోపై ఆర్ఆర్ఆర్ టీం పెట్టిన ఓ ట్వీటే కారణమని తెలుస్తోంది.

    రాజమౌళి RRR టీమ్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. జక్కన్నపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం RRR టీమ్ చేసిన ఓ ట్వీట్. గత రెండు మూడు రోజులుగా నెట్టింట్లో తీవ్ర అసహనంతో ఉన్న మహేష్ ఫ్యాన్స్‌ని RRR టీమ్ చేసిన ట్వీట్ ఇంకాస్త ఇబ్బంది పెట్టింది. దీంతో రాజమౌళి సహా RRR యూనిట్ మొత్తాన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది.

    మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీ తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జనం మెచ్చిన సినిమాగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సక్సెస్‌పై టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించకపోవడంతో మహేష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. సర్కారు వారి పాట విడుదలై మూడు నాలుగు రోజులు గడుస్తున్నా టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు, హీరోలు స్పందించక పోవడం పట్ల గుర్రుగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ RRR యూనిట్ చేసిన ట్వీట్ మరింత కాక రేపడమే గాక రాజమౌళిపై ట్రోలింగ్‌కి కారణమైంది.


    తన తోటి హీరోల సినిమాలు విడుదలై సక్సెస్ బాటలో వెళుతుంటే సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు కంగ్రాట్స్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో RRR సినిమా గురించి కూడా మహేష్ రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే RRR టీమ్ మహేష్ బాబు ప్రెస్టేజియస్ మూవీ 'సర్కారు వారి పాట'పై మౌనం పాటిస్తూ తమిళ హీరో శివ కార్తికేయన్ 'డాన్' సినిమా గురించి రియాక్ట్ అయింది. 'డాన్' సినిమా సక్సెస్‌పై ట్వీట్ పెడుతూ 'డాన్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ అని పేర్కొంది.

    ఇది చూశాక మహేష్ బాబు ఫ్యాన్స్‌కి చిర్రెత్తే కోపం వచ్చింది. ఇంకేముంది వెంటనే ట్రోలింగ్ షురూ చేసి జక్కన్నను ఓ ఆట ఆడుకుంటున్నారు. మా మహేష్ బాబు RRR సినిమా గురించి ట్వీట్ వేశాడు.. కానీ మీరు మాత్రం 'సర్కారు వారి పాట' మూవీపై రియాక్ట్ కాలేదు సరికదా తమిళ సినిమా గురించి ట్వీట్ వేస్తారా? అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరైతే 'నక్కన్న' అని ప్రస్తావిస్తూ రాజమౌళిపై విరుచుకుపడుతున్నారు. ఇక రాజమౌళి సినిమాలు అస్సలు చూడం, ఎంకరేజ్ చేయం అంటూ ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికైతే ఇలా సర్కారు వారి పాట సినిమా ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్‌లో, అభిమాన వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, Rajamouli, RRR, Sarkaru Vaari Paata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు