Chiranjeevi Acharya-Mahesh Babu: చిరంజీవి ‘ఆచార్య’పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆసక్తి.. ఎందుకంటే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్‌ను సినిమా యూనిట్ ప్రకటించింది.

Acharya Teaser: కథ గురించి టీజర్ కొంత క్లారిటీ ఇచ్చిందనే చర్చ కూడా సాగుతోంది. కొందరైతే ఈ సినిమా కథ... మహేశ్ బాబు ఖలేజా మూవీ కథను పోలి ఉందని అనుకుంటున్నారు.

  • Share this:
    ఖైదీ నంబర్ 150తో మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తరువాత కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైదీ నంబర్ 150 తరువాత చిరంజీవి నటించిన సైరా మూవీ ఆడియెన్స్‌ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా... మెగాస్టార్ చిరంజీవి ప్రయోగానికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తరువాత మళ్లీ రెగ్యూలర్ మాస్ ఎంటర్ టైనర్ కథను ఎంచుకున్న చిరంజీవి... మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య అనే సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమా టీజర్‌ నేడు ఆడియెన్స్ ముందుకొచ్చింది. టీజర్‌లో మెగాస్టార్ యాక్షన్ చూసి ఖుషి అవుతున్న ఫ్యాన్స్.. చిరంజీవి కెరీర్‌లో మరో బిగ్ హిట్ ఖాయమని సంబరపడిపోతున్నారు. సమ్మర్‌లో అభిమానులకు మెగాస్టార్ ఫఉల్ మీల్స్ పెడతారని ఎదురుచూస్తున్నారు.

    ఇదిలా ఉంటే ఆచార్య టీజర్ చూసిన వాళ్లంతా ఈ సినిమా కథ ఎలా ఉంటుందని ఊహించుకోవడం మొదలుపెట్టారు. కథ గురించి టీజర్ కొంత క్లారిటీ ఇచ్చిందనే చర్చ కూడా సాగుతోంది. కొందరైతే ఈ సినిమా కథ... మహేశ్ బాబు ఖలేజా మూవీ కథను పోలి ఉందని అనుకుంటున్నారు. ఓ గూడెంను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడం.. వారిని చిరంజీవి అడ్డుకోవడం చూస్తుంటే.. ఖలేజా కథ గుర్తొస్తోందని పలువురు భావిస్తున్నారు.

    అయితే సినిమా కథ వేరుగా ఉన్నా.. లైన్ మాత్రం ఖలేజా స్టోరీ లైన్ తరహాలోనే ఉంటుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండటంతో.. అతడి క్యారెక్టర్‌పై క్లారిటీ వస్తే తప్ప.. ఆచార్య స్టోరీ ఏంటనే విషయాన్ని పూర్తిగా అంచనా వేయలేమనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఆచార్య టీజర్‌.. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.
    Published by:Kishore Akkaladevi
    First published: