Mahesh Babu: తమన్‌పై మహేష్ అభిమానుల ఫైర్.. బలిసిందా అంటూ..

Mahesh Babu: హీరోలకేమో తెలియదు కానీ వాళ్ల అభిమానులకు మాత్రం ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తమ హీరోని చిన్న మాట అంటే కూడా తట్టుకోలేరు. ఒక్కొక్కసారి ఏమీ అనకపోయినా ఏదో అన్నట్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2020, 7:29 PM IST
Mahesh Babu: తమన్‌పై మహేష్ అభిమానుల ఫైర్.. బలిసిందా అంటూ..
మహేష్ బాబు తమన్ (mahesh babu thaman)
  • Share this:
హీరోలకేమో తెలియదు కానీ వాళ్ల అభిమానులకు మాత్రం ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తమ హీరోని చిన్న మాట అంటే కూడా తట్టుకోలేరు. ఒక్కొక్కసారి ఏమీ అనకపోయినా ఏదో అన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు సంగీత దర్శకుడు తమన్ విషయంలో కూడా ఇదే జరిగింది. పాపం ఆయన చేయని తప్పుకు మహేష్ బాబు అభిమానుల చేతిలో అనవసరంగా బుక్కయ్యాడు. అయినా ఆయన ఏం చేశాడు.. ఎందుకు తిడుతున్నారు అనుకుంటున్నారా.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మహేష్ బాబును తమన్ బ్రదర్ అని పిలవడమే ఈ వివాదానికి కారణం.


తన అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు చేసిన బర్త్ డే ట్వీట్ వైరల్ అవుతుంది. దాన్ని రీ ట్వీట్ చేశాడు తమన్. గతంలో మహేష్‌ను స్టేజిపై ఎప్పుడు కలిసినా కూడా సర్ అని సంబోధించేవాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబు ట్వీట్‌ను రీ ట్వీట్ చేసి మంచి నిర్ణయం బ్రదర్ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. మా హీరోను నువ్వు బ్రదర్ అని పిలుస్తావా.. సార్ అని పిలవాలి కదా.. ముందు సారి చెప్పి ఆ తర్వాత సారు అని పిలువు అంటూ తమన్ ట్వీట్ కింద కామెంట్స్ పెడుతున్నారు మహేష్ బాబు అభిమానులు.

తమన్‌పై మహేష్ అభిమానులు ఫైర్ (thaman mahesh babu)
తమన్‌పై మహేష్ అభిమానులు ఫైర్ (thaman mahesh babu)
ఒకప్పుడు మహేష్ బాబును చాలా గౌరవ ప్రదంగా సార్ అని పిలిచే తమన్ ఇప్పుడు బ్రదర్ అనేసాడు. దాంతో నీకు చాలా బలిసింది అంటూ ఈ సంగీత దర్శకుడిని టార్గెట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. అయితే ఇందులో అంత తప్పు ఏముంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేయడం కాకపోతే బ్రదర్ అనే మాటలో బూతు ఉందా.. తెలుగులో అన్నా అని పిలుచుకునే బదులు ఇంగ్లీష్‌లో బ్రదర్ అన్నాడు అందులో తప్పేముంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

తమన్‌పై మహేష్ అభిమానులు ఫైర్ (thaman mahesh babu)
తమన్‌పై మహేష్ అభిమానులు ఫైర్ (thaman mahesh babu)


అసలు ఇందులో వివాదం సృష్టించాల్సిన అవసరం ఏముంది.. మహేష్ బాబుతో తమన్‌కు ఉన్న చనువు కారణంగా అలా బ్రదర్ అని పిలిచి ఉంటాడు. దాన్ని కూడా ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా కూడా కాంట్రవర్సీకి కనీసం ఒక హద్దు అంటూ ఉండాలి.. ఇంత చిన్న విషయానికి కూడా హర్ట్ అయితే.. అభిమానులు చేసే పనికి మహేష్ బాబు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)


ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఈయన నటించిన దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు సినిమాలకు కూడా తమన్ సంగీతం అందించాడు.
Published by: Praveen Kumar Vadla
First published: August 7, 2020, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading