హోమ్ /వార్తలు /సినిమా /

ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోన్న మహేష్ బాబు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోన్న మహేష్ బాబు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మహేష్ బాబు (Mahesh Babu)

మహేష్ బాబు (Mahesh Babu)

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంతకీ మహేష్ బాబు.. తన ఫ్యాన్స్‌ను ఎందుకు తికమక పెట్టడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. వివరాల్లోకి వెళితే.. 

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంతకీ మహేష్ బాబు.. తన ఫ్యాన్స్‌ను ఎందుకు తికమక పెట్టడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. వివరాల్లోకి వెళితే.. మహేష్‌బాబు తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. దీంతో టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఈ పండుగను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు. జనాలు పండుగ పూట ఖాళీగా ఉండడంతో సినిమాలు చూసే అవకాశం ఎక్కువ. దీన్నే అదునుగా తీసుకుని సినిమాలు విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఈ సంక్రాంతికి మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో పాటే అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’సినిమా కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది.  పండగ సందర్భంగా సినిమాలు వస్తే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. వసూళ్లు అదిరిపోయే స్థాయిలో ఉంటాయి. అందుకే మహేష్ మళ్లీ సంక్రాంతి పండగనే లక్ష్యంగా చేసుకున్నాడని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తోన్న ఈ కొత్త చిత్రాన్ని వేసవిలో ప్రారంభించి సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమాలో మరోసారి మహేష్ బాబు సరసన కియారా అద్వానీ నటించే అవకాశాలున్నాయి.

మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ (Mahesh Babu Family Trip)
మహేష్‌ బాబు, వంశీ పైడిపల్లి

అయితే ఈ చిత్రాన్ని జేమ్స్‌బాండ్ తరహా స్పై సినిమా అనే వార్తల వినబడ్డాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు గూఢచారి పాత్రలో కనువిందు చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు.. పూర్తి స్థాయి  సీక్రెట్ ఏజెంట్ పాత్రలో అభిమానులను కనువిందు చేయనున్నాట్టు సమాచారం. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం వంశీ పైడిపల్లితో మహేష్ బాబు చేయబోయేది గ్యాంగ్ స్టార్ మూవీ అని చెబుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే గ్యాంగ్ స్టర్ పాత్ర అని చెబుతున్నారు. గతంలో మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’లో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి.. జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తాడా ? లేకపోతే.. గ్యాంగ స్టర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తాడా అని అభిమానులు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొత్తానికి మహేష్ బాబు, వంశీ పైడిపల్లి చేయబోయే సినిమా క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Anil Ravipudi, Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood, Vamsi paidipally

ఉత్తమ కథలు