హోమ్ /వార్తలు /సినిమా /

మహర్షి వేడుకలో మహేష్ ఫ్యాన్ హల్‌చల్.. స్టేజీ పైకి దూసుకొచ్చి ఏమన్నాడంటే..

మహర్షి వేడుకలో మహేష్ ఫ్యాన్ హల్‌చల్.. స్టేజీ పైకి దూసుకొచ్చి ఏమన్నాడంటే..

ఇదే వేడుకలో.. తన 25 సినిమాల జర్నీ గురించి.. ఆ సినిమా దర్శకుల గురించి మహేష్ బాబు గుర్తుచేసుకున్నారు. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, గుణశేఖర్, శ్రీను వైట్ల, కొరటాల శివ వంటి దర్శకుల పేర్లు గుర్తుచేసుకుని.. తనకు మంచి సినిమాలు ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటానని చెప్పారు.

ఇంకా చదవండి ...

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం 'మహర్షి' ప్రీ-రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ప్రీరిలీజ్ వేడుకలో హీరోలు విక్టరీ వెంకటేశ్, విజయ దేవరకొండలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్.. ఇండస్ట్రీలో తాను అందరి కంటే ఎక్కువగా ఇష్టపడే హీరో వెంకటేశ్ అని చెప్పారు. అలాగే ఇప్పటి యువ హీరోల్లో విజయదేవరకొండను తాను ఎక్కువగా ఇష్టపడుతానని చెప్పారు.

  మహేష్ బాబు అలా మాట్లాడుతుండగానే.. ఓ ఫ్యాన్ స్టేజీ పైకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీని తప్పించుకుని స్టేజీ పైకి వచ్చిన అతను.. మహేష్ బాబు ముందు నిలబడి.. 'మీరంటే చచ్చిపోతాను సార్' అని భావోద్వేగంతో చెప్పాడు. దీంతో ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పిన మహేష్ బాబు అతన్ని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇంతలోనే సెక్యూరిటీ ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మహేష్ బాబు స్పీచ్ చివరలోనూ మరో అభిమాని కూడా స్టేజీ పైకి దూసుకొచ్చి 'ఒక్క ఫోటో సార్' అంటూ అడిగాడు. అయితే సెక్యూరిటీ అతన్ని వెంటనే అక్కడి నుంచి కిందకు తీసుకెళ్లిపోయారు.

  ఇక ఇదే వేడుకలో.. తన 25 సినిమాల జర్నీ గురించి.. ఆ సినిమా దర్శకుల గురించి మహేష్ బాబు గుర్తుచేసుకున్నారు. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, గుణశేఖర్, శ్రీను వైట్ల, కొరటాల శివ వంటి దర్శకుల పేర్లు గుర్తుచేసుకుని.. తనకు మంచి సినిమాలు ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటానని చెప్పారు.

  First published:

  Tags: Maharshi, Mahesh Babu, Mahesh Babu Latest News

  ఉత్తమ కథలు