మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంతేకాదు ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి నమ్రతతో పాటు మహేష్ బాబు కొడుకు, కూతురు గౌతమ్ కృష్ణ, సితార ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఈ వేడుకలు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఇంట్లో పూజలు చేసిన తర్వాత ఆ వినాయకుడిని నిమజ్జనం కూడా చేసారు. ఈ వేడుకలో నమ్రతతో పాటు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఈ పూజా కార్యక్రమంలో మహేష్ బాబు మాత్రం ఎక్కడ కనపడలేదు. ఇక మహేష్ బాబు పిల్లల గురించి చెబితే.. ఇప్పటికే సితార తనకంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది.
View this post on Instagram
మహేష్ బాబు విషయానికొస్తే.. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు.. త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2020, Mahesh babu, Namrata, Tollywood, Vinayaka Chavithi 2020