హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu:నువ్వు లేకుంటే... తండ్రిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్టు

Mahesh Babu:నువ్వు లేకుంటే... తండ్రిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్టు

తండ్రి కృష్ణతో మహేష్ బాబు

తండ్రి కృష్ణతో మహేష్ బాబు

మహేష్ బాబు తన తండ్రికి ఫాదర్స్ డే సందర్భంగా విషెస్ తెలిపారు. మరోవైపు నమ్రత కూడా తన పిల్లలకు తండ్రి అయిన మహేష్ బాబు విషెస్ చెబుతూ ఓ ఎమోషనల్ నోట్ రాశారు.

ఇవాళ ఫాదర్స్ డే...  ఈ సందర్భంగా టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా... తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖ నటులు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు  ఇలా అంతా ... ఫాదర్స్ డే విషెస్ చెబుతూ.. ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నాన్న కృష్ణకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ..  ఓ పోస్టు పెట్టారు.  ‘నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక నమ్రతా కూడా మహేష్ బాబుకు ఫాదర్స్ డే విషెస్ తెలిపారు.నాకు భర్తగా.. నా పిల్లలకు తండ్రిగా.. నీలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం నిజంగా నా అదృష్టం అంటూ నమ్రతా ఫాదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.

ఒక గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అని మెగాస్టార్‌ చిరంజీవి అనారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఫోటోని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. చిరుతో పాటు నితిన్ కూడా ఫాదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేశారు. నీలా ఎవ్వరూ ఉండరు అంటూ.. నితిన్ తన తండ్రి ఫోటోను షేర్ చేశారు.

ప్రతీ ఏటా అంతర్జాతీయ పితృ దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది.


ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ  దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.

First published:

Tags: Fathers Day, Krishna, Mahesh Babu

ఉత్తమ కథలు