Mahesh Babu: మహేష్ బాబును అలాంటి పాత్రలో చూడడానికి అభిమానులు ఒప్పుకుంటారా.. ఇంతకీ సూపర్ స్టార్ ఆ సాహసం చేస్తారా.. ?

మహేష్ బాబు (Mahesh Babu Photo : Twitter)

Mahesh Babu: మహేష్ బాబును అలాంటి పాత్రలో చూడడానికి అభిమానులు ఒప్పుకుంటారా.. ఇంతకీ సూపర్ స్టార్ ఆ సాహసం చేస్తారా.. ? వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Mahesh Babu: మహేష్ బాబును అలాంటి పాత్రలో చూడడానికి అభిమానులు ఒప్పుకుంటారా.. ఇంతకీ సూపర్ స్టార్ ఆ సాహసం చేస్తారా.. ? వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు హీరోలు ఒక జానర్‌కు పరిమితం కాకుండా జానపద, పౌరాణిక, చారిత్రక నేపథ్యంలో ఉన్న సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కానీ మహేష్ బాబు.. మాములు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసారు. కానీ చారిత్రక, జానపద, జానపదం అంటూ ఎక్స్‌పెరిమెంట్స్ చేయలేదు. ఇక ‘శ్రీమంతుడు’ సినిమా మరియు ‘భరత్ అను నేను’  సినిమాల్లో సామాజిక సమస్యల నేపథ్యంలో చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా బ్యాంకింగ్ రంగంలో మోసం నేపథ్యంలో చేస్తున్నారు. ఇంత వరకు మహేష్ బాబు సోషియో ఫాంటసీ, చారిత్రక, పౌరాణిక, జానపద సినిమాలు చేయలేదు.

    ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ’రామాయణం’లో రాముడి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ మహేష్ బాబు ఓకే చేస్తే మహేష్ బాబు కెరీర్‌లో తొలి పౌరాణిక సినిమా అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేసినా.. రాముడు, రావణాసురుడిగా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు కూడా కంప్లీట్ చేసినట్టు సమాచారం.

    mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu burripalem,mahesh babu second dose vaccination,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సెకండ్ డోస్ వాక్సినేషన్,తెలుగు సినిమా,మహేష్ బాబు బుర్రిపాలెం దత్తత
    మహేష్ బాబు


    దాంతో పాటు... మహేష్ బాబు .. గుణశేఖర్ దర్శకత్వంలో ‘ప్రతాపరుద్రుడు’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గుణశేఖర్ కూడా ‘రుద్రమదేవి’ సినిమా చివరల్లో ‘ప్రతాపరుద్రుడు’ సినిమా ఉంటుందని  చెప్పారు. ఇప్పటికే గుణశేఖర్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేసారట. ఇప్పటికే పలువురు హీరోలుకు కూడా చెప్పారు. కానీ మహేష్ బాబు మాత్రంఈ సినిమా స్టోరీ విని ఇంప్రెస్ అయ్యాడని సమాచారం.. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ‘ఆర్ఆర్ఆర్’లో చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు’ పాత్రల్లో కనిపంచున్నారు.  అంతకు ముందు అల్లు అర్జున్.. రుద్రమదేవిలో గోనా గన్నారెడ్డి పాత్రలో నటిస్తే.. రానా .. చాళుక్య వీరభద్రుడిగా నటించిన సంగతి తెలిసిందే కదా.  మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.

    Mahesh Babu Will Done Historical Movie Prataparudrudu With Gunasekhar Here Are The Details,Mahesh Babu: తొలిసారి చారిత్రక పాత్రలో మహేష్ బాబు.. ఇంతకీ ఏ పాత్రలో అంటే..,Mahesh Babu,Mahesh Babu First Historical Movie,Mahesh Babu First Mythological Movie,Mahesh Babu First Devotional Movie, Mahesh Babu,Prataparudradu,Mahsh babu as Prataparudradu,Prataparudradu Mahesh babu Gunasekhar,Gunasekhar Mahesh babu,Mahesh Babu Twitter,Mahesh babu Instagram,Tollywood,Telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు ప్రతాపరుద్రుడు,మహేష్ బాబు గుణశేఖర్,గుణశేఖర్ ప్రతాపరుద్రుడుగా మహేష్ బాబు,తొలిసారి చారిత్రక యోధుడి పాత్రలో మహేష్ బాబు,
    మహేష్ బాబు,గుణశేఖర్ (File/Photo)


    అంతకు ముందు బాలకృష్ణ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చారిత్రక యోధుల పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రభాస్..‘బాహుబలి’ వంటి జానపద సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇపుడు అదే రూట్లో మహేష్ బాబు తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటు వంటి చారిత్రక యోధుడైన ప్రతాపరుద్రుడు పాత్రలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ఎలా ప్రత్యేకంగా నిలిచిందో ఇపుడు గుణశేఖర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా మహేష్ బాబు కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పరశురామ్, రాజమౌళి సినిమాల తర్వాత గుణశేఖర్‌తో చేయబోయే ‘ప్రతాపరుద్రుడు’ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాతో పాటు ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మహేష్ బాబుతో ‘ప్రతాపరుద్రుడు’ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. గతంలో మహేష్ బాబు, గుణశేఖర్ కలయికలో ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా మహేష్ బాబు కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తే అభిమానులు యాక్సెప్ట్ చేయకపోవడం అంటూ ఉండదంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: