MAHESH BABU DIE HEART FAN PADMAJA DIED BY SUICIDE TA
మహేష్ బాబు అభిమాని మృతి.. శోక సంద్రంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్..
మహేష్ బాబు వీరాభిమని పద్మజ మృతి (Twitter/Photo)
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందులో మహేష్ బాబు వీరాభిమాని అయిన తమిళ నటి పద్మజ చెన్నైలోని తిరువొట్టియూర్‌లోని తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు చెన్నై పోలీసులు చెప్పారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తెలుగులో కాకుండా.. దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక హిందీలో మహేష్ బాబు డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. మహేష్ బాబును అభిమానించే వాళ్లలో మగ అభిమానుల కంటే లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అందులో మహేష్ బాబు వీరాభిమాని అయిన తమిళ నటి పద్మజ చెన్నైలోని తిరువొట్టియూర్‌లోని తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు చెన్నై పోలీసులు చెప్పారు. ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో మెరిసిన పద్మజకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఈమెకు హీరోల్లో మహేష్ బాబు అంటే వీరాభిమానం. గతంలో మహేష్ బాబు సినిమా విడుదలైతే.. చేతిలో కర్పూరం పెట్టుకొని హారతి ఇవ్వడం వంటివి చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అప్పటి వీడియో వైరల్ అవుతోంది. 23 ఏళ్ల పద్మజ కొత్త కాల క్రితం భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయింది. ఈమెకు రెండేళ్ల బాబు ఉన్నాడు. కొన్నేళ్లుగా కొడుకుతో ఒంటరిగానే ఉంటోంది. ఆర్థిక పరమైన సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. తమ తోటి అభిమాని ఆత్మహత్య చేసుకొని తనువు చాలించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతిని కలగాలని పోస్ట్ చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.