• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MAHESH BABU DAUGHTER SITARA SINGS MARATHI GANPATI AARTI SONG GOES VIRAL SR

Mahesh Babu-Sitara : మరాఠిలో గణపతి హారతి పాట పాడిన సితార.. వీడియో వైరల్..

మహేష్ బాబు సితార (Mahesh babu Sitara)

Mahesh Babu-Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార, తరచూ సోషల్ మీడియాలో తన వీడియోలను పంచుకుంటూ  చాలా యాక్టివ్ ‌గా వుంటున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార, తరచూ సోషల్ మీడియాలో తన వీడియోలను పంచుకుంటూ  చాలా యాక్టివ్ ‌గా వుంటున్న సంగతి తెలిసిందే. సితార.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటి కప్పుడు తను చేసే పనులను మహేష్ బాబు అభిమానులతో పంచుకుంటుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ తనకు తోచిన అంశాలపై ఆమె తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి చర్చిస్తుంది. ఇక సితార తన తండ్రి మహేష్ పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ అదరగొడుతూ ఉంటుంది. అంతేకాదు ఆమె వేసే డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటి కప్పుడు మహేష్ బాబుతో పాటు నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అది అలా ఉంటే.. సితార ఇప్పుడు మరాఠీ కూడా నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. మరాఠీలో గణపతి స్తోత్రాన్ని తనదైన శైలిలో సితార ఆలపిస్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గౌతమ్ కూడా కనిపిస్తున్నాడు. కాగా సితార తల్లి నమ్రత మరాఠీ అనే విషయం తెలిసిందే.

    ఇక సితార ఇప్పటికే బాహుబలి సినిమాలోని పాటలతో పాటు తన తండ్రి మహేష్ బాబు నటించిన ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసి వార్తల్లో నిలిచిన ఈ చిట్టి తల్లి.. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఫేమస్ సాంగ్ మైండ్ బ్లాక్‌కి తన దైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెల నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: