కూతురు సితార చేసిన పనికి మురిసిపోతున్న మహేష్ బాబు..

కూతురు సితార చేసిన పనికి మహేష్ బాబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత కొన్ని రోజులుగా సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఈ చిట్టి తల్లి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: August 2, 2020, 2:14 PM IST
కూతురు సితార చేసిన పనికి మురిసిపోతున్న మహేష్ బాబు..
కూతురు డాన్స్‌కు మహేష్ బాబు ఫిదా (Instagram/Photo)
  • Share this:
కూతురు సితార చేసిన పనికి మహేష్ బాబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత కొన్ని రోజులుగా సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటి కప్పుడు తను చేసే పనులను మహేష్ బాబు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తండ్రి మహేష్ బాబుకు హెడ్ మసాజ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా లిటిల్ ప్రిన్స్ 8వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సితారకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.  అంతేకాదు ఈ సందర్భంగా తన తల్లి తండ్రులతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.  సితార ఎప్పటి కప్పుడు తాను డాన్స్ చేపే వీడియోలను మహేష్ బాబుతో పాటు నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇప్పటికే బాహుబలి సినిమాలోని పాటలతో పాటు తన తండ్రి మహేష్ బాబు నటించిన ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసి వార్తల్లో నిలిచిన ఈ చిట్టి తల్లి.. తాజాగా ఓ ఇంగ్లీష్ పాటకు చిందేసింది. ఇపుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ నుంచి మొదలుపెట్టనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 2, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading