Home /News /movies /

MAHESH BABU DAUGHTER SITARA DANCES TO AN ENGLISH SONG VIDEO GOES VIRAL SR

Mahesh Babu | Sitara : ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు సితార.. వీడియో వైరల్..

మహేష్ బాబు సితార (Mahesh babu Sitara)

మహేష్ బాబు సితార (Mahesh babu Sitara)

Mahesh Babu | Sitara : మహేష్ బాబు గారాల పట్టి.. చిన్నారి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అందులో తాజాగా సితార తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu) గారాలపట్టి సితార, తరుచూ సోషల్ మీడియాలో తన వీడియోలను పంచుకుంటూ  చాలా యాక్టివ్ ‌గా వుంటున్న సంగతి తెలిసిందే. సితార.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటి కప్పుడు తాను చేసే పనులను మహేష్ బాబు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ తనకు తోచిన అంశాలపై ఆమె తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి చర్చిస్తుంది. ఇక సితార తన తండ్రి మహేష్ పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ అదరగొడుతూ ఉంటుంది. అంతేకాదు ఆమె వేసే డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటి కప్పుడు మహేష్ బాబుతో పాటు నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అది అలా ఉంటే.. సితార తాజాగా మరో వీడియోను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోలో సితార ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ అదరగొట్టారు. మోడ్రన్ డాన్స్‌లో స్టెప్పులు వేస్తూ ఇరగ దీసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఇక గతంలో సితార ప్రభాస్ బాహుబలి సినిమాలోని పాటలతో పాటు తన తండ్రి మహేష్ బాబు నటించిన ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసిన సంగతి తెలిసిందే.  ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు.

  Bigg Boss Telugu 5 : తప్పించుకున్న లోబో.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే..

  ఇక ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

  ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

  సర్కారు వారి పాట ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్  (Vidya Balan)నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

  Samantha : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తీర్థ యాత్రలు.. పిక్స్ వైరల్..

  ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

  ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Mahesh babu, Sitara ghattamaneni, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు