కూతురు సితార చిందేసింది.. నాన్న మహేష్ బాబు మురిసిపోయాడు..

య‌థా తండ్రి.. త‌థా త‌న‌య‌.. ఇప్పుడు సితారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అచ్చంగా తండ్రి మాదిరే ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బుజ్జిత‌ల్లి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 2:07 PM IST
కూతురు సితార చిందేసింది.. నాన్న మహేష్ బాబు మురిసిపోయాడు..
మహేష్ బాబు సితార ఫైల్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 2:07 PM IST
య‌థా తండ్రి.. త‌థా త‌న‌య‌.. ఇప్పుడు సితారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అచ్చంగా తండ్రి మాదిరే ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బుజ్జిత‌ల్లి. ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు పోస్టులు పెడుతూనే ఉంటుంది సితార‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ చిన్నారి. ఎప్పటికప్పుడు తన పోస్టులతో మాయ చేస్తుంటుంది ఈ చిన్నారి పాప. తాజాగా ఈమె చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. నాన్న మహర్షి సినిమా పాటకు తనదైన శైలిలో చిందేసింది సితార.


ఈమె డాన్స్ చూసిన మ‌హేష్ బాబు ఎంతో మురిసిపోతున్నాడు. చిన్నితల్లి చేసిన డాన్స్ వీడియోతో గాల్లో తేలిపోతున్నాడు సూపర్ స్టార్. పాలపిట్టలో మెరుపు అంటూ సితార వేసిన స్టెప్పులు ఔరా అనిపిస్తున్నాయి. ఈ పాప టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. దానికి ముందు కూడా ఓ సారి కుండలు తయారీ చేస్తూ.. మరోసారి పాట పాడుతూ వీడియోలు పోస్ట్ చేసింది సితార. ఇక మ‌హేష్ బాబు కూడా ఈ వీడియో చూసి ఆనందంలో తేలిపోతున్నాడు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...