టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, జీఎస్టీ డిపార్ట్మెంట్ మధ్య వార్ ముదిరింది. 2007-08 ఏడాదికి సంబంధించి ఆయన కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించి.. దానికి సంబంధించి సర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించలేదంటూ జీఎస్టీ డిపార్ట్మెంట్ మహేష్ బాబుకు చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసింది. 2007-08 సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.18.50లక్షలు కట్టాల్సి ఉండగా, అది వడ్డీ, పెనాల్టీతో కలపి రూ.73.50లక్షలు అయిందంటూ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో తెలిపింది. దీనికి సంబంధించి మహేష్ బాబు స్పందించకపోవడంతో ఆయనకు చెందిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేసింది.
జీఎస్టీ డిపార్ట్మెంట్కు సూపర్ స్టార్ మహేష్ బాబు కౌంటర్ ఇచ్చారు. జీఎస్టీ శాఖ చెబుతున్నట్టుగా 2007-08 ఏడాదిలో అంబాసిడర్ సేవలు ఎలాంటి పన్ను పరిధిలోకి రావని మహేష్ బాబు తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. అంబాసిడర్ సర్వీసెస్ ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుంచి అమల్లోకి తెచ్చారని వారు కౌంటర్ ఇస్తున్నారు. దీంతోపాటు హైకోర్టు పరిధిలో ఉన్న లీగల్ అంశాలపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్లను ఎటాచ్ చేయడాన్ని వారు తప్పుపట్టారు. మహేష్ బాబు చట్టానికి కట్టుబడి అన్ని ట్యాక్సులు సక్రమంగా చెల్లించారని స్పష్టం చేశారు.

మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినట్టు జీఎస్టీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్