MAHESH BABU COMMENTS ON HINDI FILMS THERE IS NO NEED TO DO A HINDI MOVIE SAYS MAHESH BABU COMMENTS GOES VIRAL SR
Mahesh Babu : హిందీ సినిమాలు ఎందుకు.. తెలుగు సినిమాలే ఇరగదీస్తోంటే.. మహేష్ పంచ్.. వీడియో వైరల్..
Mahesh Babu comments on Hindi films Photo : Twitter
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే మహేష్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన హిందీ సినిమా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు (Mahesh Babu) తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఒక జర్నలిస్టు మహేష్ సినిమాలను గురించి అడుగుతూ.. డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నించారు. దీనికి మహేష్ ఖతర్నాక్ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేసిన సినిమాలే హిందీతో పాటు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతేకాదు రాజమౌళితో తన తదుపరి సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోందని పేర్కోన్నారు. ఇక మహేష్ నటిస్తున్న ప్రస్తుత సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) విషయానికి వస్తే.. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి పెన్నీ సాంగ్ (Penny Music Video) విడుదలైంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఇక ఈ (Sarkaru Vaari Paata) సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. కారణం ఇంకా షూట్ చేయాల్సింది భాగానే ఉందట. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.