ఆయన మాస్టర్.. రవిబాబుపై మహేష్ బాబు ప్రశంసలు

ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అవును’ తర్వాత రవిబాబు మరోసారి హార్రర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. 'ఆవిరి’ సినిమాను రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

news18-telugu
Updated: September 30, 2019, 9:59 PM IST
ఆయన మాస్టర్.. రవిబాబుపై మహేష్ బాబు ప్రశంసలు
రవిబాబు, మహేష్ బాబు
  • Share this:
వెరైటీ చిత్రాలతో సంచలనాలు సృష్టించే దర్శకుడు రవిబాబుపై టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రశంసలు కురిపించారు. రవిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆవిరి చిత్రం టీజర్ ఇటీవల విడుదైల విషయం తెలిసిందే. ఆ టీజర్‌ను చూసిన మహేష్ బాబు.. రవిబాబును మెచ్చుకున్నారు. హారర్ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయని.. అలాంటి సినిమాలను తీయడంలో రవిబాబు మాస్టర్‌ అని పొగిడారు. ఆవిరి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు మహేష్ బాబు.

ఇటీవల ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసిన రవిబాబు.. తాజాగా ‘ఆవిరి’ అనే హార్రర్ నేపథ్య చిత్రంతో మన ముందుకుకొస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అవును’ తర్వాత రవిబాబు మరోసారి హార్రర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. 'ఆవిరి’ సినిమాను రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇతర పాత్రల్లో నేహా చౌహాన్,శ్రీముక్త, భరణి శంకర్,ముఖ్తార్ ఖాన్ నటించారు. ఈ సినిమాను ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రకటించారు.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు