సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు షేర్ భారీగానే ఉందిగా...

సరిలేరు నీకెవ్వరు సినిమాను సుమారు రూ.110 కోట్ల వరకు విక్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబుకి కూడా భారీగానే షేర్ దక్కనుంది.

news18-telugu
Updated: October 16, 2019, 4:21 PM IST
సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు షేర్ భారీగానే ఉందిగా...
మహేష్ బాబు
news18-telugu
Updated: October 16, 2019, 4:21 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి బరిలో దూకబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. 2020 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మహేష్ బాబు తొలిసారిగా ఈ సినిమాలో సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. తాజాగా సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ బాబు భారీ రెమ్యునరేషన్ కంటే సినిమా అమ్మకంలో షేర్ తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఈ సినిమాకు సుమారు రూ.35 కోట్ల షేర్‌ను మహేష్ బాబు తీసుకుంటున్నట్టు సినిమా యూనిట్ నుంచి ప్రాథమిక సమాచారం. భరత్ అనే నేను, మహర్షి సినిమాల తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అటు అనిల్ రావిపూడి కూడా ఎఫ్ 2 సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని యూనిట్ నమ్మకంతో ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాను సుమారు రూ.110 కోట్ల వరకు విక్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్టు జరిగి.. మహేష్ బాబుకి రూ.35 కోట్ల షేర్ దక్కితే.. తన కెరీర్‌లో అత్యంత ఎక్కువ పారితోషికం అందుకున్న వాడు అవుతాడు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...