రష్మిక ఏం చిన్న పిల్ల కాదు... మహేష్ బాబు పంచ్ మామూలుగా లేదుగా

విజయశాంతి మాట్లాడుతూ... రష్మిక చిన్నపిల్ల అన్నారు. అంతే వెంటనే అందుకున్న ప్రిన్స్ మహేష్ రష్మీక చిన్న పిల్ల ఏం కాదు అన్నారు మహేష్ బాబు.

news18-telugu
Updated: January 14, 2020, 2:41 PM IST
రష్మిక ఏం చిన్న పిల్ల కాదు... మహేష్ బాబు పంచ్ మామూలుగా లేదుగా
మహేష్ బాబు రష్మిక
  • Share this:
సరిలేరు నీకెవ్వరు టీం ఫుల్ జోష్ లో ఉంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ టైమ్ మాస్ ఎంటర్ టైనర్‌గా ఆడియన్స్ ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే కలెక్షన్స్‌లో కూడా దూసుకుపోతుంది. అయితే ఇవాళ భోగీ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీం  చిట్ చాట్‌లో పాల్గొంది. ఏదైనా ఒక సీక్రేట్ చెప్పాలంటూ దర్శకుడు అనిల్ రావిపూడి అడగడంతో ... ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ... రష్మిక చిన్నపిల్ల అన్నారు. అంతే వెంటనే అందుకున్న ప్రిన్స్ మహేష్ రష్మీక చిన్న పిల్ల ఏం కాదు... హీరోయిన్ అయిపోయిందంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు చిన్నపిల్ల అంటే నా కూతురు సితార... సితార పాప అంటూ... పంచ్ లు వేశారు మహేష్. దీంతో విజయశాంతితో పాటు టీమ్ అంతా ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు