సరిలేరు నీకెవ్వరు టీం ఫుల్ జోష్ లో ఉంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ టైమ్ మాస్ ఎంటర్ టైనర్‌గా ఆడియన్స్ ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే కలెక్షన్స్‌లో కూడా దూసుకుపోతుంది. అయితే ఇవాళ భోగీ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీం చిట్ చాట్‌లో పాల్గొంది. ఏదైనా ఒక సీక్రేట్ చెప్పాలంటూ దర్శకుడు అనిల్ రావిపూడి అడగడంతో ... ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ... రష్మిక చిన్నపిల్ల అన్నారు. అంతే వెంటనే అందుకున్న ప్రిన్స్ మహేష్ రష్మీక చిన్న పిల్ల ఏం కాదు... హీరోయిన్ అయిపోయిందంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు చిన్నపిల్ల అంటే నా కూతురు సితార... సితార పాప అంటూ... పంచ్ లు వేశారు మహేష్. దీంతో విజయశాంతితో పాటు టీమ్ అంతా ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.
— Anil Ravipudi (@AnilRavipudi) January 14, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu Latest News, Maheshbabu25, Rashmika mandanna, Sarileru Neekevvaru, Tollywood