Home /News /movies /

MAHESH BABU CLARITY ABOUT COMMENTS ON BOLLYWOOD MOVIES SB

Mahesh Babu: నేను అలా అనలేదు.. బాలీవుడ్ వ్యాఖ్యలపై మహేష్ బాబు వివరణ

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu Photo : Twitter

మహేష్ బాబు బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనేక రకాల ప్రశ్నల్ని లేవనెత్తాయి. తనల్ని బాలీవుడ్ భరించలేదని టాలీవుడ్ ప్రిన్స్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

    మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట(Sarkaru vaari paata). ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈసందర్భంగా మహేష్ అండ్ టీం.. ప్రమోషన్లలో బిజీగా ఉంది. దీంతో ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో మీడియా అడిగే ప్రశ్నలకు మహేష్ బాబు(Mahesh Babu) ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీనే షేక్ చేశాయి. బాలీవుడ్ (Bollywood)ఇండస్ట్రీపై మహేష్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. బాలీ వుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ తనను బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భరించలేరని కామెంట్ చేశాడు మహేష్ బాబు. టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ తీసుకొచ్చిందని మహేష్ స్పష్టం చేశారు.

    తెలుగు ఇండస్ట్రీని విడిచి ఇతర ఇండస్ట్రీలకు పని చేయాలనే ఆలోచన తనకు లేదన్నారు. తెలుగులోనే మరిన్ని సినిమాలు తీసి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాననీ మహేష్ తన మనసులో మాట బయటపెట్టారు. బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ హిందీ మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు.అయితే మహేష్(Mahesh Babu) చేసిన వ్యాఖ్యలు కొందరు బాలీవుడ్ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేశారు. హిందీలో డైరెక్ట్‌గా సినిమా చేయను.. మీకు కావాలంటే మీరే డబ్ చేసుకోండి అని మహేష్ అంటున్నాడని కొందరు నెటిజన్స్ ఆయనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే బాలీవుడ్ పై మహేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో.. దీనిపై మహేష్ మరోసారి వివరణ ఇచ్చాడు.

    బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌ గురించి తాజగా మరో ఓ విలేకరి ప్రశ్నించగా...మహేశ్‌ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘బాలీవుడ్‌పై నేను ఎప్పుడు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్‌ సినిమాలు చేయనని చెప్పలేదు..నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్‌ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్లే ఆలోచనలేదు’ అని మహేశ్‌ చెప్పుకొచ్చారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bollywood, Mahesh Babu, Sarkaru Vaari Paata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు