హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: ఆచార్య కోసం వస్తోన్న మరో సర్ ప్రైజ్ గెస్ట్.. ఎవరో తెలుసా?

Acharya: ఆచార్య కోసం వస్తోన్న మరో సర్ ప్రైజ్ గెస్ట్.. ఎవరో తెలుసా?

ఆచార్య కోసం మరో గెస్ట్

ఆచార్య కోసం మరో గెస్ట్

ఆచార్య సినిమాలో నెరేషన్ తో పాటు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వాయిస్ ఇవ్వడానికి ఏకంగా సూపర్ స్టార్ నే కొరాటాల రంగంలోకి దింపారని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. మరో వారం రోజుల్లో ఆచార్య రిలీజ్ కాబోతోంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ఆచార్య ని ధియేటర్ దాకా తీసుకురావడానికి కొరటాల కష్టపడుతున్నారు. చిరంజీవి, చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్యకు అసలు వీళ్లిద్దరే హైలెట్ అనుకుంటే ఇప్పుడు మరోస్టార్ హీరో కూడా రంగంలోకి దింపుతున్నారు కొరటాల. ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

2019 లో మొదలైన ఆచార్య మొత్తానికి 2022 లో ధియేటర్లోకి రాబోతోంది. ఏప్రిల్ 29న మరో వారం రోజుల్లో సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ని కూడా యాడ్ చేసి స్టార్ స్టడెడ్ మూవీ చేసేశారు కొరటాల. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఆచార్య గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు.

గతంలో ఆచార్య కోసం ఏపీ సీఎం జగన్ వస్తారనే వార్తలు వినిపించాయి. అవి కాస్త పోయి.. తరువాత ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడని.. లేటెస్ట్‌గా దర్శకధీరుడు రాజమౌళి వస్తాడని అంటున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఓ సర్‌ప్రైజ్ గెస్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

నిజానికి ఆచార్య చిత్రంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆచార్య సినిమాలో నెరేషన్ తో పాటు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వాయిస్ ఇవ్వడానికి ఏకంగా సూపర్ స్టార్ నే కొరాటాల రంగంలోకి దింపారని సమాచారం. దీంతో తమ సినిమాకు మహేష్ చేత ప్రమోషన్ చేయిస్తే కలిసొస్తుందని కొరటాల భావించడం.. మహేష్‌ను రిక్వెస్ట్ చేయడం వరుసగా జరిగిపోయాయట. అయితే మహేష్ కూడా ఈ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్‌గా రావడానికి ఓకే అన్నట్లుగా తెలుస్తుంది. చిరంజీవి, చరణ్ తోపాటు .. మహేష్ బాబు కూడా ఆచార్యకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా రేంజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయిందని మెగా ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. ఇక మహేష్ చీఫ్ గెస్ట్‌గా వస్తే.. ఈవెంట్ మరింత అదిరిపోతుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

First published:

Tags: Acharya movie, Chiranjeevi, Koratala siva, Mahesh Babu, Ram Charan

ఉత్తమ కథలు