• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU CHARGED A RECORD REMUNERATION FOR SAI SURYA DEVELOPERS TVC AD PK

కాలర్ ఎగరేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఒక్క సెకండ్‌కు 20 లక్షలు..

కాలర్ ఎగరేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఒక్క సెకండ్‌కు 20 లక్షలు..

మహేష్ బాబు ఫైల్ ఫోటో

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలే అక్కడున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు కదా.. ఆ మాత్రం డిమాండ్ ఉండటంలో అస్సలు తప్పలేదు.

  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలే అక్కడున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు కదా.. ఆ మాత్రం డిమాండ్ ఉండటంలో అస్సలు తప్పలేదు. పైగా ఈయనకు సినిమాల్లోనే కాదు.. యాడ్ రంగంలో కూడా మంచి మార్కెట్ ఉంది. మహేష్ బాబుతో యాడ్స్ చేసుకోడానికి చాలా కార్పోరేట్ కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఈయన డేట్స్ కోసం చాలా మంది నిర్మాతలతో పాటు కార్పోరేట్ కంపెనీలు కూడా క్యూ కడుతుంటాయి. మరి అంత డిమాండ్ ఉన్నపుడు సప్లై కోసం రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇదే ఇప్పుడు చేసాడు ఈయన.

ఒక్కడే అయితే కాస్త రేటులో రిబేట్ ఉంటుంది కానీ ఫ్యామిలీ మొత్తం నటించాలంటే ఆస్తులు రాసివ్వాల్సిందే. మహేష్ కూడా ఇప్పుడు ఓ యాడ్ కోసం అక్షరాలా 6 కోట్లు తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో తనతో పాటు కుటుంబాన్ని మొత్తం స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తనతో పాటు కుటుంబ సభ్యులు అంతా నటించడంతో యాడ్ వ్యాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. భార్య నమ్రతా శిరోధ్కర్‌తో పాటు జూనియర్ స్టార్ గౌతమ్.. కుమార్తె సితార కూడా కనిపించారు.

Mahesh Babu charged a record remuneration for Sai Surya Developers TVC Ad pk నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలే అక్కడున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు కదా.. ఆ మాత్రం డిమాండ్ ఉండటంలో అస్సలు తప్పలేదు. Mahesh Babu,Mahesh Babu twitter,Mahesh Babu instagram,Mahesh Babu ads,Mahesh Babu real estete ad,Mahesh Babu movies,Mahesh Babu Sai Surya Developers TVC,mahesh babu Namrata,mahesh babu Gautam,mahesh babu Sitara,telugu cinema,mahesh babu remuneration,namrata shirodkar,namrata shirodkar remuneration,namrata shirodkar hot,మహేష్ బాబు,మహేష్ బాబు యాడ్స్,మహేష్ బాబు శ్రీ సూర్య డెవలపర్స్ యాడ్,తెలుగు సినిమా,మహేష్ బాబు రెమ్యునరేషన్
కుటుంబంతో మహేష్ బాబు


ఈ యాడ్ 30 సెకండ్ల నిడివితో వచ్చింది. దీనికోసం ఏకంగా 6 కోట్లు తీసుకున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఒక్క మహేష్ అయితే 2 నుంచి 3 కోట్లలో పని అయిపోయేది. కానీ ఫ్యామిలీ వచ్చింది కాబట్టి రేట్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. విడుదలైన ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో టాప్‌లో ఉంది ఈ యాడ్. మొత్తానికి 30 సెకన్లకు 6 కోట్లు అంటే సెకండ్‌కు 20 లక్షల వరకు ఛార్జ్ చేసినట్లే కదా. అది మా హీరో రేంజ్ అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published: