హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు చేసిన పనికి జై కొడుతున్న నెటిజన్లు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్ ..

మహేష్ బాబు చేసిన పనికి జై కొడుతున్న నెటిజన్లు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్ ..

మహేష్ బాబు Photo : Instagram

మహేష్ బాబు Photo : Instagram

ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలంటారు. అది మహేష్ బాబు‌కు అది కరెక్ట్‌గా సెట్ అవుతోంది. తాజాగా మహేష్ బాబు..

  ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలంటారు. అది మహేష్ బాబు‌కు అది కరెక్ట్‌గా సెట్ అవుతోంది. తాజాగా మహేష్ బాబు.. తన దగ్గర ఎన్నో ఏళ్ల నుండి పర్సనల్ మేకప్ మేన్‌గా పనిచేస్తోన్న పట్టాభికి మహేష్ బాబు స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. ఈ సందర్భంగా అతనితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. మొత్తంగా మహేష్ బాబు తన మేకప్ మేన్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు తన పర్సనల్ మేకప్ మేన్‌ పుట్టినరోజు గుర్తు పెట్టుకొని విషెస్ తెలియజేయడం చూసి మహేష్ బాబు ఫ్యాన్స్‌తో నెటిజన్స్ మహేష్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. మహేష్ బాబు విషయానికొస్తే.. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


  ఈ సినిమాను బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఆధారంగా చేసుకోని పరుశురామ్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్, నివేధా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు