• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • MAHESH BABU BIRTHDAY WISHES TO HER MOTHER INDIRA DEVI ON TWITTER WITH AN ADORABLE PIC SR

Mahesh Babu : తల్లికి మహేష్ బర్త్ డే విషెస్.. అపురూపమైన ఫోటోను పంచుకున్న సూపర్ స్టార్..

Mahesh Babu : తల్లికి మహేష్ బర్త్ డే విషెస్.. అపురూపమైన ఫోటోను పంచుకున్న సూపర్ స్టార్..

Mahesh Babu Photo :Twitter

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు.

 • Share this:
  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా తన తల్లితో దిగిన ఓ అపురూపమైన ఫోటోను పంచుకున్నాడు. అంతేకాదు.. తన తల్లికి బర్త్ డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే అమ్మా.. అంటూ అప్యాయంగా రాసుకున్నాడు. అది చూడాటానికి సింపుల్‌గా ఉన్నా.. హృదయాలను తాకుతోంది. దీంతో ఇక ఆయన ఫ్యాన్స్ అందరూ మహేష్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్‌ను కన్నావమ్మా అంటూ తమ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక మహేష్‌ సోదరి మంజులా సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'తన నువ్వులానే తన వ్యక్తిత్వం కూడా ఎంతో స్వచ్చమైనది. మా జీవితంలోని ప్రతీ రోజును గొప్పగా తీర్చదిద్దావు. మన కుటుంబానికి నువ్వే వెన్నముక.. లవ్‌ యూ అమ్మ..హ్యపీ బర్త్ డే అమ్మ' అంటూ మంజులా ట్వీట్ చేసింది. మరోవైపు మహేష్ సతీమణి నమ్రత కూడా బర్త్ డే విషెస్ తెలిపుతూ ఓ ఫోటోను పంచుకుంది.

  ఇక మహేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన సరిలేరు నీకెవ్వరు తర్వాత పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా తొలిసారిగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌‌ షూటింగ్ జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌లో చిత్ర షూటింగ్ దుబాయ్ లో చేశారు. అక్కడి ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఇక కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్‌ను మళ్ళీ దుబాయ్ కు షిఫ్ట్ చేశారు. విసాలు కొందరికి దొరక్క మళ్లి దుబాయ్‌కి రెండవ షెడ్యూల్ షిప్ట్ అయ్యింది. అయితే అక్కడ కోవిడ్ కేసులు ఎక్కువుగా ఉండడంతో ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే కానిస్తున్నారు. అయితే కరోనా సేకండ్ వేవ్ కారణంగా ఇటు రెండు రాష్ట్రాల్లో కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ రెండవ షెడ్యూల్ కూడా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

  వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published:

  అగ్ర కథనాలు