మెగాస్టార్ చిరంజీవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మెగాస్టార్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి రావడాన్ని స్వాగతిస్తూ మహేష్ బాబు బెస్ట్ విషెస్ తెలియజేసాడు.

news18-telugu
Updated: March 26, 2020, 6:32 AM IST
మెగాస్టార్ చిరంజీవికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు..
మహేష్ బాబు చిరంజీవి (Source: Twitter)
  • Share this:
శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తొలిసారి తన తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులను ఖుషీ చేసారు చిరంజీవి. ఈయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వివిధ చిత్ర సీమలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన సోషల్ మీడియా ఫ్లామ్‌ఫామ్‌లోకి రావడాన్ని స్వాగతిస్తూ అభినందలు తెలియజేసారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నాగార్జున, రాధిక, సుహాసిని, దర్శక ధీరుడు సహా పలువురు ఆయన సోషల్ మీడియాలోకి వెల్కమ్ చెప్పారు. తాజాగా చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టడాన్ని మహేష్ బాబు అభినందించారు. ట్విట్టర్‌లోకి మెగాస్టార్ చిరంజీవిగారికి స్వాగతం అంటూ తన బెస్ట్ విషెస్ తెలియజేేస్తూ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను రీ ట్వీట్ చేసారు.  మహేష్ బాబు.. చిరంజీవి, కొరటాల శివ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి గెస్ట్‌గా రావడం తెలిసిందే కదా.

ఇక చిరంజీవి సోషల్ మీడియా అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నట్టు కొణిదెల ప్రొడక్షన్స్ అధికార ట్విట్టర్ నుండి  ఒక రోజు ముందుగా ప్రకటించారు. ఇక మీదట తన మనసులోని భావాలను, సందేశాలను డైరెక్ట్‌గా అభిమానులతో పంచుకోవాలనే నిర్ణయంతో చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఇక మీదట ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కనిపించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షణ్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలోరామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. చరణ్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. మొత్తానికి చిరంజీవి తెలుగు సంవత్సరాది రోజున తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు