MAHESH BABU ASHOK GALLA IT IS ALSO POSSIBLE FOR MAHESH BABU IN HIS CAREER OF THESE YEARS BUT ASHOK GALLA WHO CREATED THE RECORD WITH THE FIRST MOVIE HERO HERE ARE THE DETAILS TA
Mahesh Babu - Galla Ashok : మామ మహేష్ బాబు వల్ల కానీది.. మేనల్లుడు అశోక్ గల్లాకు సాధ్యమైంది.. ఫ్యాన్స్ ఖుషీ..
మహేస్ బాబుకు సాధ్యం కానీ రికార్డ్.. సెట్ చేసిన మేనల్లుడు అశోక్ (Photo Credit :Twitter)
Mahesh Babu - Galla Ashok : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా. తాజాగా సూపర్ స్టార్ కుటుంబం నుంచి ’హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా... ఫస్ట్ మూవీతోనే మహేష్ బాబుకు కూడా సాధ్యం కానీ రికార్డు క్రియేట్ చేసాడు.
Mahesh Babu - Galla Ashok : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా. ఇక సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) కుటుంబం నుంచి ముందుగా దివంగత రమేష్ బాబు (Ramesh Babu) హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పుకొని.. చిన్నల్లుడు సుధీర్ బాబుపోసాని (Posani Sudheer Babu) కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసారు. ఇపుడు కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా కథానాయకుడుగా ‘హీరో’మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన జనవరి 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.
తాజాగా ఈ సినిమా IMDB (Internet Movie Data Base)లో 9.2/10 రేటింగ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ రేంజ్ రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా ఏది లేదు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఇన్నేళ్ల కెరీర్లో ఏ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ IMDBలో రాలేదు. కానీ గల్లా అశోక్ ఫస్ట్ మూవీతోనే ఈ ఫీట్ అందుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IMDB రేటింగ్‌లో ‘హీరో’ మూవీకి 9.2/10 రేటింగ్ (Twitter/Photo)
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయికగా నటించింది. ‘హీరో’ చిత్రాన్ని సినీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక సామాన్య వ్యక్తి ఇండస్ట్రీలో హీరో కావాలనుకుంటారు. ఈ సందర్బంగా తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించారా లేదా అనేదే ‘హీరో’ మూవీ స్టోరీ. ఈ సినిమాలో గల్లా అశోక్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ నటించారు. మిగతా పాత్రల్లో జగపతి బాబు నటించారు.
ఈ సినిమాలో ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ స్టెప్పేసిన జుంబారే జుం జుంబరే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాట అప్పట్లో సంచలనం. ఇప్పటికీ ఈ పాటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో 'జుంబారే' పాటలో సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్సుతో అలరించారు. అప్పట్లో ఓ బడా హీరో ఈ రకంగా పాట కోసం గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం అదే మొదలు.
ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా.. జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ పాటను హీరో సినిమా కోసం వాడుకున్నారు. ఈ చిత్రాన్ని అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పద్మావతి గల్లా, గల్లా జయదేవ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసారు. . సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో జగపతి బాబు, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం నటించారు. మరి తాత సూపర్ స్టార్ కృష్ణకు, మేనమామ మహేష్ బాబుకు ఎక్కువగా కలిసొచ్చిన సంక్రాంతి పండగ.. ఇపుడు గల్లా అశోక్‌కు కూడా బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.