Home /News /movies /

Mahesh Babu - Trivikram: మహేష్ -త్రివిక్రమ్ సినిమా.. అలాంటి కథతో వచ్చే సమ్మర్ లో రచ్చ రచ్చే!

Mahesh Babu - Trivikram: మహేష్ -త్రివిక్రమ్ సినిమా.. అలాంటి కథతో వచ్చే సమ్మర్ లో రచ్చ రచ్చే!

mahesh babu trivikram

mahesh babu trivikram

Mahesh Babu - Trivikram:  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    Mahesh Babu - Trivikram:  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

    మహేష్ ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఈరోజు అప్డేట్ వస్తుందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అలా వైరల్ అయినట్టుగానే ఈరోజు అప్డేట్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా హారిక హాసిని బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ఈరోజు సాయంత్రం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కాయి. అందులో "అతడు" సినిమా మంచి విజయాన్ని అందుకోగా "ఖలేజా" పర్వాలేదనిపించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పూజా హెగ్డే మహేష్ బాబు సరసన "మహర్షి" సినిమాలో నటించారు. మహేష్ పూజకు ఇది రెండవ సినిమా అని చెప్పవచ్చు.



    త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజాహెగ్డే ఇప్పటివరకు "అరవింద సమేత వీర రాఘవ" చిత్రంలో, అల్లుఅర్జున్ సరసన "అలా వైకుంఠపురం" సినిమాల్లో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజకు ఇది మూడో సినిమా. దీంతో మహేష్ కు, పూజా హెగ్డే కు ఇద్దరికీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇది మూడో సినిమా. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రీకరణ పూర్తవ్వగానే మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని విషయాలను చిత్రబృందం త్వరలోనే ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా ఈ కాంబోకు హ్యాట్రిక్ అవుతుందో లేదో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Athadu, Khaleja, Mahesh babu, Mb28, Pooja Hegde, Trivikram, త్రివిక్రమ్, మహేష్

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు