కేరళ వెళ్తున్న మహేష్ బాబు, రష్మిక మందన్న...

మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

news18-telugu
Updated: November 3, 2019, 11:30 AM IST
కేరళ వెళ్తున్న మహేష్ బాబు, రష్మిక మందన్న...
Instagram
  • Share this:
మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. F2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టాలని  పక్కాగా స్క్రిప్ట్‌ను తయారు చేసుకుని.. తెరకెక్కిస్తున్నాడు. మరో వైపు రిలీజ్‌‌కు కూడా ఇబ్బంది ఏర్పడకుండా.. పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ ఎక్కడా అనవసరమైన బ్రేక్స్ రాకుండా చూసుకుంటున్నారు. ఇటీవలే హైదరబాద్‌లో వేసిన కొండా రెడ్డి బురుజు సెట్‌లో షూటింగ్ జరుపుకున్న టీమ్... ప్రస్తుతం  కొత్త షెడ్యూల్ కోసం కేరళకు బయలుదేరి వెళ్లింది. కాగా ఈ షెడ్యూల్ సినిమాలో చాలా కీలకమైన షెడ్యూల్ అని, ఇందులో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.


దీనికి తోడు.. చిత్ర బృందం కూడా చాలా సంతోషంగా ఉందని.. ఇప్పటివరకు వచ్చిన ఔట్ పుట్ చాలా బాగుండడంతో అందరూ ఆనందంగా ఉన్నారని తెలుస్తోంది. కాగ ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అందులో భాగంగా విడుదల తేదిని ప్రకటించిన చిత్ర బృందం ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తోంది. మహేష్ సరసన  రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. మరో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.  దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


 
View this post on Instagram
 

Let’s spice up things a little- Who’s the celebrity who want to take on a date with 😍 and pay for?🤪😂


A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on
స్టైలీష్ లుక్‌లో కేక పెట్టిస్తోన్న సమంత...
First published: November 3, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading