Home /News /movies /

MAHESH BABU AND SITRARA SUMMER WALKING ON ROADS VIDEO VIRAL SB

Mahesh Babu: రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న మహేష్, సితార.. వీడియో వైరల్

కూతురు సితారతో మహేష్

కూతురు సితారతో మహేష్

రోడ్డంతా ఖాళీగా ఉంది. ఆ రోడ్డుపై తండ్రీ కూతురు కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ వీడియోను సితార తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది.

    మహేష్ బాబు, ఆయన కూతురు సితార ఘట్టమనేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం చేసినా నిమిషాల్లోనే ఆ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. డిఫరెంట్ వీడియోలు పోస్టు చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా సితార.. తన తండ్రి మహేష్‌బాబుతో(Mahesh Babu) కలిసి వాకింగ్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది.

    ఈ వీడియోలో..మహేష్ తన కూతురు సితారతో కలిసి మాట్లాడుకుంటూ.. రోడ్డుపై హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్లిద్దరు తప్ప ఆ రోడ్డుపై జనాలు ఎవ్వరూ లేరు. ఇక ఈ వీడియోకు సితార(Sitara) ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘సమ్మర్ వాక్ విత్ నాన్న.. ఫర్‌ఎవెర్ మై ఫేవరేట్ అంటూ పేర్కొంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, నెటిజన్లు సితార పెట్టిన పోస్టుపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అంటూ.. కామెంట్ చేస్తున్నారు.



    ‘రోడ్డుపై ఫ్రీగా నడుస్తున్నారు.. మీకు దారిలో ఎవరైనా తెలుగువారు కనిపిస్తే ఏం జరుగుతంది? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి మరో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు.ఇంకేం జరుగుతంది ఆగమాగం అయితారు అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్.. అన్నా చెల్లెల్లా ఉన్నారంటూ కామెంట్ చేశాడు. మీ నాన్న మిలియన్స్ మందికి ఫేవరేట్.. నీకు కూడా అంటూ మరో నెటిజన్ అన్నారు. ఇంకో నెటిజన్ అలాంటి వ్యక్తి నీ తండ్రి కావడం నువ్వు చేసుకున్న అదృష్టం అంటూ కామెంట్ చేశారు.




    మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళితో కలిసి సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ కటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం వీరి ఫారిన్ ట్రిప్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, Mahesh babu family, Sitara ghattamaneni

    తదుపరి వార్తలు