తెలుగు ప్రజలకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ. దీంతో టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఈ పండుగను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు. దీంతో ఒకటి రెండు రోజుల తేడాతో చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. కారణం జనాలు పండుగ పూట ఖాళీగా ఉండడంతో సినిమాలు చూసే అవకాశం ఎక్కువ. దీన్నే అదునుగా తీసుకుని సినిమాలు విడుదల చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఈ రాబోయే సంక్రాంతికి కూడా తెలుగు బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీనే ఉండనుంది. సాధారణంగా పెద్ద పండగకు అగ్ర కథానాయకుల సినిమాల హడావుడి బాగానే ఉంటుంది. అయితే, ఈసారి ఇంకాస్త పోటీ నెలకొంది. ఇందుకు కారణం మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో వస్తుండగా, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’తో రానున్నాడు. అంతేకాదు, ఈ ఇద్దరూ ఒకేరోజు తమ సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు. అందులో భాగంగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే..
తెలుగు టాప్ హీరోలు ఇద్దరు ఒకే రోజు సినిమాలను విడుదల చేస్తే..కమర్షియల్‌గా నష్టం వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు తెలుగు సినీ పండితులు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలైతే.. వచ్చే ఓపెనింగ్స్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. నిర్మాతకు నష్టం కల్గించే అంశం. మరీ ఈ నేపథ్యంలో ఒక సినిమా ముందుకు.. మరో సినిమా ఒక రోజు వెనక్కి వెళ్లే అవకాశం ఉండోచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈ ఏర్పాటు వల్ల కొంతలో కొంతైనా ఆర్ధికంగా లాభం చేకూరుతుంది. అయితే ఈ ప్రతిపాదనను ఇద్దరూ హీరోలు కూడా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీ మార్పు విషయంలో ఇటూ మహేశ్‌బాబు గానీ, అటూ అల్లు అర్జున్ గానీ ఒప్పుకోవడటం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇరువురూ తమ చిత్రాల్నీ జనవరి 12వ తేదీనే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారట. ఈ ఇద్దరీలో ఎవరూ తగ్గకపోతే జనవరి 12న బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఉండనుంది. అయితే ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉన్నందున విడుదల తేదిలో మార్పులు జరిగే అవకాశం ఉండోచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.