సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య గత కొన్నేళ్లుగా రిలీజ్ డేట్స్ విషయంలో పెద్ద రచ్చే నడిచింది. తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత పోస్టర్స్ సాక్షిగా మరోసారి వీళ్లిద్దరు ఒకరిపై ఒకరు యుద్దమే చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య గత కొన్నేళ్లుగా రిలీజ్ డేట్స్ విషయంలో పెద్ద రచ్చే నడిచింది. చివరి నిమిషంలో విడుదల తేదిల విషయంలో ఒకరిపై మరోకరు పై చేయి సాధించాలనుకున్నారు. కానీ.. విడుదల తేదీల విషయంలో నిర్మాతలు ఒక అండర్ స్టాండింగ్ రావడంతో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత పోస్టర్స్ సాక్షిగా మరోసారి వీళ్లిద్దరు ఒకరిపై ఒకరు యుద్దమే చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మంచి రివ్యూ రేటింగ్స్ వచ్చాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తే... ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏ సెంటర్ ఆడియన్స్‌ను గురి పెట్టింది. మహేష్ బాబు ప్రతి సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ వస్తాయి. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ మొగుడు అంటూ ఒక పోస్టర్ ట్వీట్ చేసాడు. మరోవైపు ‘అల వైకుంఠపురములో’ టీమ్ మాత్రం పూర్తి బాక్సాఫీస్ ఫలితం రాకుండానే సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ విడుదల చేసి.. ఎక్కడా తగ్గేది లేదంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్‌కు సూచనలు పంపారు.
ఇక కలెక్షన్స్ పోస్టర్ విషయంలో అసలైన బాక్సాఫీస్ రిపోర్ట్స్‌కు చిత్ర బృందం విడుదల చేసిన వాటికి ఎంతో తేడా ఉందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. గతంలో కూడా హీరోలు.. ఇలానే కలెక్షన్స్ విషయంలో ఎంతో అతిగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో కూడా కొన్ని డైలాగ్స్ కూడా ఒకరిని ఉద్దేశించి మరోకరు రాసుకున్నట్టుగా ఉంది. ఎలాగైనా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు సినిమాలకు సంబంధించి టీవీల్లో యూట్యూబ్‌లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో కలెక్షన్స్, ఇతరత్రా విషయాల్లో రచ్చ కెక్కడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.