మహేష్ రాజమౌళి చిత్రానికి ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన ఆరోజే..

మహేష్, రాజమౌళి Photo : Twitter

మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో లవ్ స్టోరీ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు.

  • Share this:
    మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో లవ్ స్టోరీ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. స్క్రిప్టు పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ ఎత్తివెయ్యాగానే షూటింగ్‌కు వెళ్లనుంది. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను కాన్ఫామ్ చేసుకున్నారట. ఈ సినిమా పూర్తవ్వగానే మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే మహేష్ సినిమా వుంటుందని ఆయన ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఈ సినిమాను రాజమౌళి కాన్ఫామ్ చేశాడో ఇక అప్పటి నుండి ఈ సినిమా ఓ జానర్‌లో ఉంటుంది.. బడ్జెట్ ఎంత.. అంటూ చర్చిస్తున్నారు.. సినీ అభిమానులు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ గా 300 కోట్లను కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో రాజమౌళి చూపించనున్నాడని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలుంటాయని.. అందుకోసం భారీస్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా రాజమౌళి మిగితా సినిమాల్లాగే తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31 కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించనుంది. ఇక రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తదుపరి షెడ్యూల్ పూనేలో మొదలుకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: