news18-telugu
Updated: May 10, 2020, 12:30 PM IST
మహేష్ బాబు (Mahesh Babu)
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు తర్వాత ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం వంశీ పైడిపల్లితో మహేష్ మాఫియా బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టి విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో సై అన్నాడు. ఈ విషయాన్ని పరశురామ్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్‌గా ఓకే అన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్న సందర్బంలో ఈ సినిమా అక్టోబర్నుండి షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందట. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. ఎందుకంటే ప్రతీ ఏటా మే 31 న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినా రోజున ఏదొక గిఫ్ట్ ఇచ్చే మహేష్ ఈసారి కూడా ఇద్దాం ప్రయత్నిస్తున్నాడట. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయం గురించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. మహేష్ ఇమేజ్ కు తగ్గట్టుగా పరశురామ్ ఒక లవ్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఇక మరోవైపు మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన మొదట హిందీ నటి కియారాను తీసుకోవాలనీ చూశారట. ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించింది. కారణం కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. అంతేకాదు మరో రెండేళ్లవరకు తన క్యాలండర్లో ఖాళీ లేదని ఆమె స్పష్టం చేసిందట. కియారా నో అనడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి ఏవరైతే బాగుంటారనీ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా కీర్తి సురేష్‌ను కూడా చిత్రబృదం పరిశీలిస్తుందని తెలుస్తోంది.
Published by:
Suresh Rachamalla
First published:
May 10, 2020, 12:30 PM IST