• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MAHESH AND PARASURAM FILM WILL BE OFFICIALLY ANNOUNCED ON MAY 31 HERE ARE THE DETAILS SR

మహేష్ పరశురామ్ సినిమా అధికారిక ప్రకటన ఆరోజే..

ఇందులో మహేష్ బ్యాంకు ఉద్యోగిగా కనిపిస్తాడని.. కొందరు చేసిన మోసాలు వల్ల తన తండ్రి బలి కావడంతో వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు.. బ్యాంకులకు వాళ్ల చేత ఏ విధంగా తిరిగి డబ్బులు కట్టించాడనేది కథగా తెలుస్తుంది. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఒక్కసారి వీసాలు వచ్చాయంటే సినిమా నాన్‌స్టాప్‌గా పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్.

సూపర్ స్టార్ మహేష్, పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    సూపర్ స్టార్ మహేష్, పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం వంశీతో ఓ మాఫియా బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టి విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ఓ సై అన్నాడు. ఈ విషయాన్ని పరశురామ్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్‌గా ఓకే అన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ఉన్న సందర్బంలో ఈ సినిమా అక్టోబర్‌నుండి షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందట. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. ఇక మరోవైపు మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన మొదట హిందీ నటి కియారాను తీసుకోవాలనీ చూశారట.అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించింది. కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. అంతేకాదు మరో రెండేళ్లవరకు తన క్యాలండర్‌లో ఖాళీ లేదని ఆమె స్పష్టం చేసిందట. కియారా నో అనడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి ఏవరైతే బాగుంటారనీ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా కీర్తి సురేష్‌ను కూడా చిత్రబృదం పరిశీలిస్తుందట.
    Published by:Suresh Rachamalla
    First published: