మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నికెవ్వరు’సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకులకు మందు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా టీం ప్రమోషన్లలో బీజీగా మారింది. దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాజాగా ఆదివారం సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అయితే ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి... ఈ వేదికపైనే చిరంజీవి కలుసున్నారు.
ఆనాటి జ్ఞాపకాల్ని ఇద్దరు గుర్తు చేసుకున్నారు. దీంతో సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ కు సంబంధించిన వార్తలు ఎక్కడ చూసినా చిరంజీవిమే హైలెట్ అవుతున్నారు. వెబ్ సైట్స్, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ట్రెండ్స్ ఎక్కడా చూసినా... చిరంజీవి వార్తలు, చిరంజీవి కామెంట్స్ మాత్రమే హైలెట్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు ఎక్కడ ట్రెండ్స్‌లో కనిపించలేదు. అంతెందుకు మహేష్ బాబు సొంత యూట్యూబ్ చానల్లో కూడా చిరంజీవియే ట్రెండ్ అయ్యారు. దీంతో ఈ విషయం పట్ల నమ్రత కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా మహేష్ బాబు ట్రెండ్స్‌లో కనిపించలేదని ఆమె తీవ్ర అసహనానికి లోనయ్యారని సమాచారం.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.