హోమ్ /వార్తలు /సినిమా /

ఉగాది నాడు ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్... మహర్షి టీజర్‌తో అదరగొట్టిన మహేష్ బాబు

ఉగాది నాడు ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్... మహర్షి టీజర్‌తో అదరగొట్టిన మహేష్ బాబు

మహర్షి టీజర్ లో దృశ్యం (Image : Youtube)

మహర్షి టీజర్ లో దృశ్యం (Image : Youtube)

Maharshi teaser : టీజర్‌లో యాక్షన్ సీన్స్ సినిమాపై అభిమానుల్లో అంచనాను పెంచేస్తున్నాయి.

భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ప్రిన్స్ మహేష్ బాబు సినిమా మహర్షి టీజర్ ఉగాది పండగ వేళ అభిమానలకు యాక్షన్ ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమాలో... మల్టీ బిలియనీర్‌గా కనిపిస్తున్న మహేష్ బాబు... కాలేజీలో స్టూడెంట్ గెటప్‌లోనూ కనువిందు చెయ్యబోతున్నాడు. 1.19 సెకండ్ల వీడియోలో ప్రతీ ఫ్రేమూ స్పెషల్‌గా కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్. విడుదలైన గంటలోనే దాదాపు ఐదు లక్షల మంది ఈ టీజర్‌ను చూశారంటే... దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రిషికుమార్ పాత్రలో కనిపిస్తున్న మహేష్ బాబు... ఇందులో చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. అదే సమయంలో... యాక్షన్ సీన్లలో రఫ్ అండ్ టఫ్ గానూ కనిపిస్తున్నాడు. తనది సక్సెస్ ఫుల్ జర్నీ అంటున్న మహేష్ బాబు చెప్పిన ప్రతీ డైలాగ్స్... ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ ట్రీట్‌లా మారింది.

Published by:Krishna Kumar N
First published:

Tags: Maharshi, Mahesh babu, Telugu Cinema News, Tollywood Movie News, Tollywood news

ఉత్తమ కథలు